ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నపునర్నవి భార్గవి

తెలుగు బిగ్ బాస్ 3 ఫేమ్ పునర్నవి భార్గవి ప్రస్తుతం ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నట్లు తెలిపి అభిమానులకు షాక్ ఇచ్చింది. ఉయ్యాలా జంపాల మూవీ లో హీరోయిన్ సైడ్ క్యారెక్టర్ లో కనిపించి ఆకట్టుకున్న ఈమె..ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి మెప్పించింది. ఈ క్రమంలో బిగ్ బాస్ 3 ఆఫర్ అమ్మడిని స్టార్ గా చేసింది. ఈ సీజన్ లో సింగర్ రాహుల్ తో నడిపిన ప్రేమాయణం అందర్నీ బాగా ఆకట్టుకుంది. ఈ షో తర్వాత అమ్మడు బాగా పాపులర్ అయ్యి..వరుస సినిమా ఛాన్సులు కొట్టేస్తుందని అంత అనుకున్నారు కానీ అవేమి కాలేదు.

ప్రస్తుతం ఈమె ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నట్లు తెలిపి షాక్ ఇచ్చింది. కొత్త సంవత్సరాన్ని అనారోగ్యంతో ప్రారంభిస్తున్నానని బాధాకరమైన విషయాన్ని వెల్లడించింది. తాను అనారోగ్యం బారిన పడటం ఇదే చివరి సారి కావాలని భగవంతుడిని కోరుకుంటున్నానని తెలిపింది. సోషల్ మీడియాలో ఈ మేరకు భార్గవి పెట్టిన మెసేజ్ ఆమె అభిమానులను చాలా బాధకు గురి చేస్తోంది. ఆమె త్వరగా కోలుకోవాలని వారు ఆకాంక్షిస్తున్నారు.