కశ్మీర్‌లో ప్రజాభిప్రాయసేకరణ ఎందుకు చేపట్టరు

Kamal Haasan
Kamal Haasan

చెన్నై: సినీనటుడు,మక్కల్‌ నీది మయ్యమ్‌ అధ్యక్షుడు కమల్‌హాసన్‌ చెన్నైలో ఆదివారం జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో ఆయన పుల్వామా ఘటనను ఉద్దేశించిమాట్లాడారు.క‌శ్మీర్ అంశంపై ప్ర‌జాభిప్రాయ‌సేక‌ర‌ణ ఎందుకు నిర్వ‌హించ‌డం లేద‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు.ప్ర‌జాభిప్రాయ సేక‌ర‌ణ నిర్వ‌హించేందుకు ప్ర‌భుత్వం ఎందుకు జంకుతున్న‌ద‌ని ఆయ‌న అడిగారు. కేవ‌లం సైనికులే ఎందుకు చ‌నిపోతున్నార‌ని, మ‌న ఇంటి కాప‌లాదారుడే ఎందుకు చావాల‌ని, రెండు దేశాల రాజ‌కీయ నేత‌లు స‌రైన రీతిలో వ్య‌వ‌హ‌రిస్తే, మ‌న సైనికులు ప్రాణాలు కోల్పోవాల్సిన అవ‌స‌రం ఉండ‌ద‌ని, నియంత్ర‌ణ రేఖ అప్ప‌డు మ‌న ఆధీనంలోనే ఉంటుంద‌ని క‌మ‌ల్ అన్నారు.