కాశ్మీర్‌లో ప్రజల భద్రత ముఖ్యం

సమితి సెక్రటరీ జనరల్‌ గ్యుటెరస్‌

antonio guterres
antonio guterres

న్యూయార్క్‌: కాశ్మీర్‌లో ప్రజల రక్షణను దృష్టిలో పెట్టుకుని భారత్‌, పాకిస్థాన్‌ ఇరు దేశాలు చర్చలు జరిపి ఈ సమస్యను పరిష్కరించుకోవాలని ఐక్యరాజ్యసమితి అధ్యక్షుడు అంటోని గుటెరస్‌ పునరుద్ఘాటించారు. ఇది రెండు దేశాలకు సంబంధించిన విషయమని, కాశ్మీర్‌ సమస్యను భారత్‌, పాక్‌లు చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని యుఎన్‌ సెక్రటరీ అధికార ప్రతినిధి స్టీఫెన్‌ దుజారిక్‌ న్యూయార్క్‌లో చెప్పారు. జనరల్‌ అసెంబ్లీకి ముందు పాకిస్థాన్‌ ప్రధాన మంత్రి, భారత్‌ ప్రధాన మంత్రులు కాశ్మీర్‌ అంశంపై చర్చించారని యుఎన్‌ ప్రధాన కార్యదర్శి అన్నారు. ఆర్టికల్‌ 370 రద్దుతో కాశ్మీర్‌లో తీవ్ర ఆందోళనలు నెలకొన్నాయి. సాధారణ పరిస్థితులు పునరుద్ధరించేందుకు భారత్‌ చర్యలు తీసుకోవాలని అమెరికా చెప్పింది. పాకిస్థాన్‌ సంబంధిత ఉగ్రవాద సంస్థలు లష్కర్‌ ఎ తోయిబా, జైషే మహ్మద్‌లతో కాశ్మీర్‌లో సమస్యలుత్పనమవుతున్నాయని, ఉగ్రవాదం పోరాడుతామని ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రభుత్వం హామీ ఇచ్చిందని వారన్నారు. జమ్మూకాశ్మీర్‌ ప్రత్యేక ప్రతిపత్తికి సంబంధించిన ఆర్టికల్‌ 370ని కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 5న రద్దు చేయడంతో అక్కడ ఉద్రిక్తతలు చెలరేగాయి. మరోవైపు పాకిస్తాన్‌ ఉగ్రవాదానికి మద్దతు ఉపసంహరించుకుంటేనే వారితో చర్చలు ఉంటాయని భారత్‌ హై కమిషనర్‌ పేర్కొన్నారు.

తాజా చెలి వార్తల కోసం క్లిక్‌ చేయండి.. https://www.vaartha.com/specials/women/