ఢిల్లీ అల్లర్లు: లైంగికంగా వేధిస్తున్న అల్లరిమూకలు

పేరు మతం అడిగి మరీ దారుణాలు

Delhi Violence
Delhi Violence

న్యూఢిల్లీ: ఈశాన్న ఢిల్లీలో కొద్ది రోజులుగా జరుగుతున్న హింసాకాండ అందరికీ తెలిసిందే. కాగా ఈ ఘటనలో బాధితులుపడ్డ వేదన వర్ణనాతీతం. తాము ఎదుర్కొన్న భయంకర అనుభవాలను బాధితులు మీడియాకు వివరిస్తున్నారు. తమ ఇంట్లోకి రాత్రి సమయంలో ఒక గుంపు ప్రవేశించి తనను, తన ఇద్దరు కూతుర్లను లైంగికంగా వేధించారని ఓ మహిళ తెలిపింది. దీంతో భయంతో వణికిపోయామని, చివరకు శరీరానికి దుప్పట్లు చుట్టుకుని బిల్డింగ్‌ పై నుంచి దూకేశామని చెప్పింది.
చివరకు చెత్త ఏరుకుని బతికే వారిని కూడా అల్లరి మూకలు వదలట్లేదు. చెత్త సేకరణకు ఈశాన్య ఢిల్లీకి వెళ్లిన షబ్బీర్‌ అనే యువకుడిపై అల్లరి మూకలు దాడిచేయడంతో తలపై తీవ్ర గాయాలయ్యాయి. తమది రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం కాబట్టి అల్లర్లు జరుగుతున్నప్పటికీ చెత్త ఏరుకోవడానికి తన కుమారుడు వెళ్లాడని, దీంతో ఏమీ తెలియని తన అమాయక కొడుకుపై దాడి చేశారని సల్మాన్‌ అనే వ్యక్తి తెలిపాడు. రోడ్డుపై కనిపించిన వారిని పట్టుకుని పేరు, మతం అడిగి కొందరు దారుణంగా కొడుతున్నారని బాధితులు వాపోతున్నారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/