కాలుష్య ప్రమాదంలో ప్రజాజీవనం?

కాలుష్య ప్రమాదంలో ప్రజాజీవనం?
Public life at risk of pollution?

కాలుష్యనివారణకు అమలుచేయలేని ఆచ రణయోగ్యంకానీ విధానాలు, ప్రయోగా లతో సమస్యను మరింత జఠిలం చేస్తున్నా రు. కాలుష్యంతో రానురాను మానవ మనుగడకే ప్రమాదంవాటిల్లే పరిస్థితులకు చేరుకున్నాయి. అటు జల కాలుష్యం,ఇటు వాయుకాలుష్యంతో భారతావని ఉక్కిరి బిక్కిరి అవ్ఞతున్నది. దేశంలో అధికశాతం ప్రజలు ఈ కాలుష్యకారణంగా అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటు న్నారని అన్నింటికంటే ముఖ్యంగా భారతదేశంలో నగ రాల్లోపీల్చే గాలి ప్రాణాంతకంగా మారుతున్నదని ప్రపంచ ఆరోగ్యసంస్థ నివేదిక హెచ్చరించింది.ప్రపంచంలో వాయు కాలుష్యం స్థాయి అత్యధికంగా ఉన్న పన్నెండునగరాల జాబితాలో భారత్‌లోనే పదకొండు ఉన్నాయంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

కాలుష్యభరిత వాయువ్ఞ ప్రపంచవ్యాప్తంగా ఉన్నా, జనాభా పెరుగు తున్నా అభివృద్ధిచెందుతున్న దేశాల్లో సమస్య రానురాను మరింత క్లిష్టంగా తయారవ్ఞతున్నది. ఇక పర్యావరణానికి సవాల్‌గా మారుతున్న ప్లాస్టిక్‌ వాడకాన్ని తగ్గించేందుకు పాలకులు తాజాగా అడుగులు వేస్తున్నారు.ఒకసారి వాడే ప్లాస్టిక్‌ను నిషేధించాలని కేంద్రప్రభుత్వం సరికొత్త ప్రతిపా దన చేసింది. ప్లాస్టిక్‌ వల్ల వస్తున్న అనర్థాలపై ప్రజల్లో చైతన్యం కల్పిస్తూ దాదాపు యుద్ధమేప్రకటించింది.ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గించాలనేది గత రెండుమూడు దశాబ్దా లుగా ప్రయత్నాలు చేస్తున్నా అది నినాదంగానే మిగిలి పోయింది.పర్యావరణంపైన, ప్రజారోగ్యంపైన ఈ ప్లాస్టిక్‌ ప్రభావం ఏమేరకు చూపుతున్నదో అవగాహన కల్పించ డంలో అవసరం మేరకు కృషి జరగలేదని చెప్పొచ్చు. వాస్తవంగా ప్లాస్టిక్‌ వ్యర్థాల వల్ల ఎదురవ్ఞతున్న ఉపద్ర వాలు అన్నీఇన్నీ కావ్ఞ.అవి వెదజల్లే కాలుషిత వాయు వ్ఞలు ప్రజారోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. భూగర్భజలాలు కలుషితమవ్ఞతున్నాయి. వ్యర్థాలు కలిసిన ఆ గడ్డిని మేసి పెద్దసంఖ్యలో పశువ్ఞలు మృత్యువాతపడుతున్నాయి.

అంతేకాదు ప్లాస్టిక్‌ వ్యర్థాలను కడుపులో నింపుకున్న పశువ్ఞలు ఇస్తున్న పాలు కూడా విషపూరితమవ్ఞతు న్నాయి. మొక్కల వేళ్లు భూమిపొరల్లోకి చొచ్చుకొని కిందికిపోకుండా ప్లాస్టిక్‌ వ్యర్థాలు అడ్డంపడుతున్నాయి. దీంతో ఎదుగుదల తగ్గిపోయి దిగుబడులు కూడా గణ నీయంగా పడిపోతున్నాయి. ప్లాస్టిక్‌ తయారీకి ముడి చమురు వాడతారు. ప్రపంచం చమురు ఉత్పత్తిలో ఎనిమిది శాతం ప్లాస్టిక్‌ తయారీకే వినియోగిస్తున్నారు.

1950లో పదిహేనులక్షల టన్నులు ఉన్న ప్లాస్టిక్‌ ఉత్పత్తి నేడు దాదాపు 35కోట్ల టన్నులకు పైగా చేరుకున్నట్లు అంచనా.ఇందులో అమెరికా అగ్రస్థానంలోఉన్నా ఆసియా, ఐరోపాలలో కూడా ప్లాస్టిక్‌ వాడకం తక్కువేమీ లేదు. భారత్‌లో కూడా పాలకులు ఎన్ని చర్యలు తీసుకుంటు న్నా ప్లాస్టిక్‌ వాడకం అంతకంతకు పెరిగిపోతున్నది. రోజుకూ దాదాపు 16వేల టన్నుల మేర ప్లాస్టిక్‌ వ్యర్థాలు విడుదలవ్ఞతున్నాయని అనధికార అంచనా. అందులో పదివేల టన్నులు మాత్రమే పునర్వినియోగానికి నోచుకుంటున్నాయి. మిగిలిన దాదాపు ఆరువేల టన్నులు నిరుపయోగ వ్యర్థాలుగా భూమిలోకి చేరిపోతున్నాయి.

ప్లాస్టిక్‌ కాలుష్యం మానవ నివాసాలు,వన్యప్రాణుల సంచార ప్రాంతాలు జలమార్గాలు, భూమిపొరలు, సముద్రాల తీరాలపై కూడా తీవ్ర ప్రభావం చూపుతున్నది. ఇక పారిశ్రామిక ద్రవ నిర్వహణకు వాడే ఫ్లోరినేటెడ్‌ ప్లాస్టిక్‌ పరిసరాల్లోని మట్టిలోకి హానికారక రసాయనికాలు విడుదల చేస్తున్నదని పర్యావరణశాస్త్రజ్ఞులే ఆందోళన చెందుతున్నారు. వీటి కారణంగా ఉపరితల జలాలు, భూగర్భజలాలు పర్యావరణ వ్యవస్థలకు తీవ్ర హాని కలిగిస్తున్నాయి. ప్లాస్టిక్‌ తయారీ సమయంలో విడుదల అవ్ఞతున్న రసాయనికాలు పీల్చే గాలి ద్వారా తినే పదార్థాల ద్వారా శరీరాల్లోకి ప్రవేశించి అనేక రోగాలకు కారణమవ్ఞతున్నాయి. చర్మవ్యాధులు, సెక్స్‌ హార్మోన్స్‌ సమస్యలకు, కేన్సర్‌ లాంటి భయంకర వ్యాధులకు ఇవి కారణమవ్ఞతున్నాయని డాక్టర్లు ఎప్పటి నుంచో చెప్తూనే ఉన్నారు. ప్లాస్టిక్‌లోని సీసం లాంటి విషపదార్థాలు అసలు మందులతో కలిసిపోవడమే ఈ అనర్థాలను మరింత పెంచుతున్నాయి.

కాలుష్యనివారణకు అమలుచేయలేని ఆచ రణయోగ్యంకానీ విధానాలు, ప్రయోగా లతో సమస్యను మరింత జఠిలం చేస్తున్నా రు. కాలుష్యంతో రానురాను మానవ మనుగడకే ప్రమాదంవాటిల్లే

ప్లాస్టిక్‌ డబ్బాల్లో ఉంచిన ఔషధాల నాణ్యత కూడా ప్రశ్నార్థకంగానే మిగు లుతున్నది. ఇక సముద్రతీరాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఐక్యరాజ్యసమితిలోని పర్యావరణ విభాగం అంచనా ప్రకారం సముద్రాలు యాభైఒక లక్షల కోట్ల చిన్నచిన్న ప్లాస్టిక్‌ ముక్కలున్నాయని తేలింది. పరిశ్రమలు, దుకాణా సముదాయాలు, గృహాల నుంచి వెలువడుతున్న ప్లాస్టిక్‌ వ్యర్థాలు చిన్న మొక్కలుగా మారి ఐరోపా, అమెరికా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా తదితర దేశాల్లోని సముద్రతీరాలకు చేరుకుంటున్నట్లు అనేక అధ్యయనాల్లో వెల్లడయింది. అందుకే ప్లాస్టిక్‌ వాడకం వల్ల జరుగుతున్న లాభాల కంటే అనేక రూపాల్లో నష్టాలు కలిగిస్తున్నదనేది కాదనలేని వాస్తవం.

ప్లాస్టిక్‌ పదార్థాల నియంత్రణకు అరకొర చర్యలు తీసుకుంటే ప్రయోజనం ఉండే అవకాశాలు కన్పించడం లేదు. ఈ మానవాళి జీవనానికి పర్యావరణానికే ప్రశ్నార్థకంగా మారుతున్న ఈ ప్లాస్టిక్‌ వాడకాన్ని, తయారీని కూడా నిషేధించే విషయంలో పాలకులు పటిష్టమైన నిర్ణయాలు తీసుకోవాలి. చట్టాలు చేయడంతోనే సరిపోదు. అది అమలు చేసేందుకు నిర్దిష్టమైన ప్రణాళికతో ముందుగా అధికార యంత్రాంగాన్ని చైతన్యం చేసి ఆ తర్వాత ప్రజల్లో అవగాహన కల్పించాలి. ఈ బాధ్యత పాలకులపైనే వదలకుండా స్వచ్ఛసంస్థలు, అన్నివర్గాల ప్రజలు సంయుక్తంగా ప్లాస్టిక్‌పై రణభేరి మోగించాల్సిన తరుణమిది.

తాజా ఎన్నారై వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/nri/