పబ్‌జీతో పాటు 118 యాప్‌లను నిషేధించిన కేంద్రం

దేశ సమగ్రతకు భంగం కలిగిస్తున్నాయని వెల్లడి

India bans PUBG and 118 Chinese apps

నూఢిల్లీ: చైనాను దెబ్బకొట్టేలా భారత్‌ మరోసారి కీలక చర్యకు ఉపక్రమించింది. ఆ దేశానికి చెందిన 118 యాప్‌లపై కేంద్రం నిషేధం విధించింది. ఈ మొబైల్ యాప్ లు దేశ సార్వభౌమత్వానికి, సమగ్రతకు, భద్రతకు, ప్రజా జీవితానికి హానికరంగా పరిణమించాయంటూ కేంద్రం ఓ ప్రకటనలో పేర్కొంది. పబ్జీ, లివిక్, పబ్జీ మొబైల్ లైట్, వుయ్ చాట్ వర్క్, వుయ్ చాట్ రీడింగ్ వంటి పలు యాప్ లు కేంద్రం విడుదల చేసిన నిషిద్ధ యాప్ ల జాబితాలో ఉన్నాయి. భారత్‌లో దాదాపు 3.3 కోట్ల మంది క్రియాశీలక పబ్‌జీ యూజర్లు ఉన్నట్లు అంచనా. భారత సైబర్‌ స్పేస్‌ భద్రతే లక్ష్యంగా తాజా నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. పలు యాప్‌లు యూజర్ల డేటాను చట్టవిరుద్ధంగా భారత్‌కు వెలుపల ఉన్న సర్వర్లకు చేరవేస్తున్నట్లు తమకు వివిధ వర్గాల నుంచి ఫిర్యాదులు అందినట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ ఖహానికర యాప్‌’లపై నిషేధం విధించాలని హోంశాఖకు చెందిన సైబర్‌ క్రైమ్‌ సెంటర్‌ సిఫార్సు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది.

కాగా కేంద్రం ఇంతకుముందే టిక్ టాక్, హలో వంటి యాప్ లను నిషేధించిన సంగతి తెలిసిందే.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/