యువతి వస్త్రాపహరణంపై డీజీపీ ఆరా

pub Dancer Case
pub Dancer Case

Hyderabad: పంజాగుట్ట లెస్బన్‌ పబ్‌ వద్ద డ్యాన్సర్‌ యువతి వస్త్రాపహరణంపై రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి ఆరా తీశారు. పంజాగుట్ట సీఐతో డీజీపీ ఫోన్‌లో మాట్లాడి కేసు వివరాలు తెలుసుకున్నారు. కేసుపై నివేదిక ఇవ్వాలని డీజీపీ మహేందర్‌రెడ్డి ఆదేశించారు. పబ్‌ వద్ద మొన్న రాత్రి సహోద్యోగులు డ్యాన్సర్‌పై దాడి చేసి అసభ్యంగా ప్రవరించారని యువతి పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించిన విషయం తెలిసిందే. తనను వ్యభిచారం చేయాల్సిందిగా ఒత్తిడి తెచ్చారని, నిరాకరించడంతో తనపై దాడి చేశారని, బ్లేడుతో గాట్లు వేశారని, వస్త్రాపరణ చేశారని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది.