తీవ్రతను బట్టే చికిత్సల ఎంపిక

మానసిక సమస్యలు – పరిష్కారం

Psychological problems
Psychological problems

వృద్ధాప్యంలో పాత గాయాలు, నొప్పులు తిరగబెడతాయంటారు పెద్దలు. బాల్యంలో లేదా యవ్వనంలో జరిగిన ప్రమాదాల వల్ల శరీరంలో దెబ్బతిని, చికిత్సతో బాగైన సమస్యలు వృద్ధాప్యంలో బాధిస్తాయంటారు.

అలాగే బాల్యం లేదా, యవ్వనంలో తలెత్తి బాగైన మానసిక రుగ్మతలు కూడా వృద్ధాప్యంలో వస్తాయని మా అమ్మ పరిస్థితిని చూస్తే తెలుస్తుంది.

మా అమ్మకు ఇప్పుడు 60 యేళ్లు. మా నాన్నకు 65 యేళ్లు. నేను ఒక్క అమ్మాయినే. నాకు పెళ్లయి పిల్లలు ఉన్నారు.

అయితే మా అమ్మకు 30 యేళ్ల క్రితం తలెత్తిన డిప్రెషన్‌, ఆత్మహత్యాభావం తిరిగి బాధిస్తోంది. ఆమెకు 25 యేళ్ల వయసులో పెళ్లయింది.

అయిదేళ్లయినా పిల్లలు పుట్టకపోవడంతో మానసికంగా కృంగిపోయింది. కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులు అనే సూటిపోటి మాటలకు కలత చెంది ఉద్వేగ లోపాలకు గురయింది.

ఏడవడం, తలబాదుకోవడం అరవడం లాంటివి చేసేదట.

ఒక్కోసారి తాను బస్సు క్రిందో రైలు కిందో పడి చనిపోతానని బెదిరించేదట. ఒకసారి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేసిందట.

దీంతో మా నాన్న, మా అమ్మమ్మ, తాతయ్యల సహకారంతో మా అమ్మను మానసిక వైద్యశాలలో చేర్పించి చికిత్స చేయించారట. ఆమె తీవ్రమైన మానసిక సమస్యలతో బాధపడుతున్నదని చెప్పి షాక్‌ ట్రీట్‌మెంట్‌ కూడా ఇచ్చారు.

మూడు నెలలు మందులు వాడిన తరువాత పూర్తిగా తగ్గిపోయింది. తరువాత గైనకాలజిస్టు ద్వారా చికిత్స చేయించిన అనంతరం గర్భం దాల్చి నేను పుట్టాను.

మరొక బిడ్డను కడనం శ్రేయస్కరం కాదని ఆమె భావించి, గర్భసంచి తీయించి వేసుకుంది. మా నాన్న ప్రభుత్వ ఉద్యోగం చేసి ఇప్పుడు రిటైర్‌ అయ్యారు. మా అమ్మ అయిదేళ్ల క్రితం పుస్తకాల షాపు నడిపేది.

ఇప్పుడు అమ్మా, నాన్న ఇద్దరు ఇంటిలోనే ంఉటున్నారు. అప్పుడప్పుడు మా ఇంటికి వచ్చి వెళుతుంటారు. వారికి ఎలాంటి సమస్యలు లేవు.

నాన్నకు 50 వేలు పెన్షన్‌ వస్తుంది. అలాగే ఇంటి అద్దెలు 20 వేలు వస్తాయి. రెండు కోట్ల విలువైన ఆస్తి ఉంది. అయితే గత మూడు నెలల నుంచి ఆమె ప్రవర్తనలో మార్పు వచ్చింది. అర్ధం లేని భయాలను వ్యక్తీకరిస్తుంది.

నిరాశ, నిస్ప్రహ నీరసం, నిస్సత్తువతో బాధపడుతుంది. వాకింగ్‌ వెళ్లడం, నలుగురితో కలవడం మానేసింది. ఇంటి పనులు కూడా సక్రమంగా చేసుకోలేకపోతున్నది.

రాత్రుల్లు సరిగా నిద్ర పోవడలేదు. తాను చనిపోతానని కొన్నిసార్లు అంటుంది. ఒక్కోసారి ఏదో ఒక జబ్బుచేసి చనిపోతానేమోనని భయం వ్యక్తీకరిస్తుంది. ఆకలి కూడా తగ్గింది. మూడు నెలల్లో 10 కిలోల బరువు పెరిగింది.

వారం క్రితం నిద్రలో లేచి చీరతో ఫ్యాన్‌కు ఉరేసుకునే ప్రయత్నం చేసింది. అలికిడికి మా నాన్న నిద్రలేచి ఆమెను కాపాడి ఓదార్చారు.

మా ఊరిలోనే డాక్టరు వద్దకు తీసుకెళితే తాత్కాలికంగా ఏవో మందులు ఇచ్చి, సైకియాట్రిస్టుకు చూపమని సలహా ఇచ్చారు.

అయితే నా స్నేహితురాలు సైకియాట్రిస్టు చూపి మందులు వాడడం కంటే సైకాలజిస్టు ద్వారా కౌన్సిలింగ్‌ చేయిస్తే మంచిదని చెప్పింది.

కాబట్టి చిన్నఆటి మానసిక రుగ్మతలు మళ్లీ వస్తాయా? కౌన్సిలింగ్‌ , మందులలో ఏది మేలో చెప్పండి.

  • సుధారాణి, తిరుత్తణి

అమ్మా! మానసిక, శారీరక సమస్యలు రుగ్మతలు మళ్లీ, మళ్లీ వచ్చే అవకాశాలు ఉంటాయి. అలా అని రావాలనీ లేదు.

ఆరోగ్యం క్షీణించిన సమయంలో శారీరక రుగ్మతలు, ప్రతికూల పరిస్థితులు తలెత్తినపుడు మానసిక రుగ్మతలు తిరిగి తలెఏ్త అవకాశాలు ఉంటాయి.

శరీర పటుత్వం తగ్గినపుడు చిన్నప్పుడు గాయాల వల్ల దెబ్బతిన్న అవయవాలలో నొప్పిలాంటి సమస్యలు కనిపిస్తుంటాయి.

ఏవీ లేకపోయినా కొత్తగా రుగ్మతలు తలెత్తే అవాకశాలు ఉన్నాయి. మన శరీరంలో కొన్నిభాగాలు అరుగుదల వల్ల, కొన్ని బలహీనపడటం వల్ల, హార్మోన్ల లోపం వల్ల రకరకాల సమస్యలు వస్తుంటాయి.

అలాగే కొన్ని ప్రతికూల పరిస్థితుల వల్ల భయం, ఆందోళన, ఒత్తిడి డిప్రెషన్‌ లాంటి మానసిక సమస్యలు తలెత్తెతుంటాయి. డిప్రెషన్‌ లాంటి మానసిక సమస్యలు ప్రతికూల పరిస్థితుల వల్ల భయం లాంటిమానసిక సమస్యలు తలెత్తుంటాయి.

అలాగే హార్మోన్ల అసమత్యుత కుటుంబ, మానసవ సంబంధాలలో వచ్చే తేడాలు కూడా రుగ్మతలకు దారి తీస్తాయి.

చిన్నతనంలో పూర్తిగా నమయమైన మానసిక రుగ్మతలు నడివయసు లేదా వృద్ధాప్యంలో రావచ్చు. కాగా మీ అమ్మ యవ్వనంలో తీవ్రమైన డిప్రెషన్‌కు గురైందంటున్నారు. మీరు చెప్పిన లక్షణాలను బట్టి ఆమె ప్రస్తుతం డిప్రెషన్‌కు లోనైనట్లు భావించాలి.

కరోనా సమస్యవల్ల లాక్‌డౌన్‌ ప్రకటించడంతో ఇంట్లోనే ఉండడం వల్ల ఒంటరితనం బాధిస్తుండవచ్చు. అలాగే రోజు కరోనా వార్తలు, మరణాల కథనాలు విని భయం పెంచుకుని ఉండవచ్చు.

వాకింగ్‌, మానేసి ఇంట్లోనే ఉండడం వల్ల శరీరం బరువ్ఞ రిెగి, నిరుత్సాహం ఆవహించి ఉంటుంది. మూడు నెలల్లో 10 కిలోల బరువ్ఞ పెరిగిందంటే ధైరాయిడ్‌ సమస్య ఉందేమోననిఅనుూనించాలి.

కాబట్టి అన్ని పరీక్షలు చేయించండి. ధైరాయిడ్‌ ఇతర సమస్యలు లేనట్లు తేలితే అది డిప్రెషన్‌గా గర్తించి సైకియాట్రిస్టుకు చూపండి.

ఆయన పరీక్షలు చేసి అవసరమైతే మందులు ఇస్తారు. లేదంటే కౌన్సిలింగ్‌ చేయించమటారు. ఒక్కోసారి రెండు అవసరం కావచ్చు.

ఆత్మహత్యాభావం ఉంది కాబట్టిముందు సైకియాట్రిస్టుకు చూపడమే మంచిది. అలాగే కౌన్సిలింగ్‌ ద్వారా ఆమె ఆలోచనల్లో మార్పు తీసుకొస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి.

డాక్టర్‌ ఎన్‌.బి.సుధాకర్‌రెడ్డి, సైకాలజిస్టు

తాజా బిజినెస్‌ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/