ప్రారంభమైన పీఎస్‌ఎల్వీ-సీ47 కౌంట్‌డౌన్‌

PSLV C47
PSLV C47

నెల్లూరు: శ్రీహరికోటలో పీఎస్‌ఎల్వీసీ47 కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది. పీఎస్‌ఎల్వీసీ47 ప్రయోగానికి ఉదయం 7.28 గంటలకు ఇస్రో శాస్త్రవేత్తలు కౌంట్‌డౌన్‌ ప్రక్రియ ప్రారంభించారు. కౌంట్‌డౌన్‌ ప్రక్రియ 26 గంటల పాటు కొనసాగనుంది. రేపు ఉదయం 9.28 గంటలకు పీఎస్‌ఎల్వీసీ47 రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లనుంది. 14 ఉపగ్రహాలను పీఎస్‌ఎల్వీసీ47 వాహకనౌక మోసుకెళ్లనుంది. కార్టొశాట్‌3తో పాటు అమెరికాకు చెందిన మరో 13 ఉపగ్రహాలను పీఎస్‌ఎల్వీసీ47 వాహకనౌక నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టనుంది. కార్టొశాట్‌3 ఉపగ్రహం భూవాతావరణం, విపత్తులను హెచ్చరించనుంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఇస్రో కార్టొశాట్‌3ని రూపొందించింది. 1,625 కిలో బరువున్న కార్టొశాట్‌3 జీవితకాలం ఐదేళ్లపాటు సేవలందించనుంది. ఉపగ్రహం తయారీకి ఇస్రో రూ.350 కోట్లు ఖర్చు చేసింది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/