విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ సీ47

ఉదయం 9.28కి ప్రయోగం


Launch of PSLV-C47 carrying CARTOSAT -3 Satellite – from Satish Dhawan Space Centre, Sriharikota

నెల్లూరు: నెల్లూరు జిల్లా శ్రీహరికోట నుంచి కార్టోశాట్3ని మోసుకుంటూ, పీఎస్ఎల్వీ సీ47, నిప్పులు చిమ్ముతూ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. ఈ ఉదయం 9.28కి ప్రయోగం జరుగగా, నాలుగు దశలు విజయవంతం అయిందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ వాహకనౌకలో థర్డ్ జనరేషన్ హై రెజల్యూషన్ ఎర్త్ ఇమేజింగ్ శాటిలైట్ గా భావిస్తున్న కార్టోశాట్3 అంతరిక్షంలోకి వెళ్లింది. పట్టణాభివృద్ధి ప్రణాళిక, గ్రామీణ వనరులకు సంబంధించి సేవలు, మౌలిక వసతుల అభివృద్ధి, తీర ప్రాంత భద్రత తదితర అంశాల్లో ఈ ఉపగ్రహం సేవలను అందించనుంది. ఈ ఉపగ్రహం ద్వారా ఉగ్రవాద స్థావరాలను మరింత స్పష్టంగా తీయవచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు. దీని జీవితకాలం ఐదేళ్లు ఉంటుందని, బరువు 1,625 కిలోలని తెలిపారు. ఇక ఇదే వాహకనౌక ద్వారా అమెరికాకు చెందిన మరో 13 నానో ఉపగ్రహాలను ఇస్రో నింగిలోకి పంపనుంది. ప్రయోగించిన తరువాత 26.50 నిమిషాల వ్యవధిలోనే అన్ని ఉపగ్రహాలను వాటికి నిర్దేశించిన కక్ష్యల్లో ప్రవేశపెట్టింది రాకెట్. చంద్రయాన్2 విఫలమైన తరువాత ఇస్రో చేస్తున్న తొలి ప్రయోగం ఇదే కావడంతో దీనిపై సర్వత్ర ఆసక్తి నెలకొంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/