మొన్న పవన్ కు జై కొట్టిన పృథ్వీ ..నేడు చంద్రబాబు కు జై అంటున్నాడు

గత ఎన్నికల్లో వైస్సార్సీపీ పార్టీ తరుపున ప్రచారం చేసి జగన్ కు జై కొట్టిన 30 ఇయర్స్ పృథ్వీ ..ఇప్పుడు జగన్ కు రివర్స్ అయ్యాడు. గత కొద్దీ రోజులుగా వైస్సార్సీపీ పార్టీ ఫై వ్యతిరేకంగా మాట్లాడుతూ..జనసేన కు జై కొడుతూ వచ్చారు. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గెలవబోతున్నారని.. తాను కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని.. భీమవరం బీఫామ్ నాదే అంటూ చెప్పుకొచ్చారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు కేవలం జనసేనకు మాత్రమే కలిసి వస్తుందని.. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతారని.. టీడీపీకి అవకాశం ఉండదన్నారు. అయితే పృథ్వీ భారీ డైలాగ్స్ వదిలినప్పటికీ జనసేన పార్టీ నేతలు కానీ , కార్య కర్తలు కానీ పట్టించుకోకపోయేసరికి , ఇప్పుడు పవన్ కళ్యాణ్ ను కాదని చంద్రబాబు ను పొగడడం మొదలుపెట్టారు.

తాజా ఇంటర్వ్యూలో పృథ్వీ మాట్లాడుతూ.. ‘వైసీపీలో నుంచి బయటకు వచ్చేసి ఇప్పుడు నేను హాయిగా ఉన్నాను.. ఇప్పుడు కావాలంటే.. చంద్రబాబు నాయుడుగారి దగ్గరకు వెళ్లొచ్చు.. ఆయన అపాయింట్‌మెంట్ కోసం ఎదురుచూస్తున్నా.. అప్పట్లో ఆయన్ని దూషిస్తూ ఒక పాటపాడాను. తప్పైపోయింది.. మీరు నన్ను క్షమించానని చెప్తే.. నేను అక్కడ నుంచి లేస్తా.. లేదంటే లేవను అని అంటాను.

అయినా చంద్రబాబు గారి స్థాయి ఏంటి? నా స్థాయి ఏంటి? ఆయన్ని గౌరవించకుండా మాట్లాడాను. వైసీపీలో ఉన్నప్పుడు తిట్టమని ప్రమోట్ చేసే వాళ్లు ఎక్కువ.. అది తప్పు అని చెప్పేవాళ్లు లేరు. చంద్రబాబు గారు సీఎంగా ఉన్నప్పుడు ఆయన్ని దూషించాను.. ఆయన్ని కూడా క్షమాపణ కోరితే గంగానదిలో మునిగినంత ప్రశాంతత ఉంటుంది నాకు.

నేను ఎవర్నెవర్నెని తిట్టానో వాళ్లందరికీ క్షమాపణ చెప్పేస్తున్నాను. కె. రాఘవేంద్రరావు గారికి కూడా క్షమాపణ చెప్పాను. అసలు దాసరి గారు ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. పార్టీ పక్కననెట్టు మాట్లాడు అని కమాండింగ్‌గా మాట్లాడేవారు.. నేను డాడీ డాడీ అనేవాడిని. ఆయన లేకపోవడం మా చిప్ పాడైపోయింది. ఇప్పుడు బాగా అయ్యింది కాబట్టి.. బాబు గారిని కలిసి క్షమాపణ చెప్తాను. అమరావతి రైతులను పెయిడ్ ఆర్టిస్ట్‌లని తప్పుచేశాను.. వాళ్లకి క్షమాపణ చెప్పాను. చంద్రబాబు గారికి క్షమాపణ చెప్తున్నా’ అంటూ చెప్పుకొచ్చారు.