ఫీజుకు సంబంధించి సమగ్ర వివరాలు అందించండి

Supreme Court
Supreme Court

న్యూఢిల్లీ: సుప్రీం కోర్టులో ఈరోజు వాసవి ఇంజినీరింగ్‌ కళాశాల ఫీజుల వ్యవహారం విచారణకు వచ్చింది. అయితే విచారణ సందర్భంగా సుప్రీం స్పందిస్తూ.. ఫీజుల వ్యవహారంలో హైకోర్టు ఆదేశాలు సరికాదని పేర్కొంది. ఫీజుల వ్యవహారంపై జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా నేతృత్వంలోని ద్విసభ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఫీజుల నిర్ణయాధికారం ప్రభుత్వ ఫీజు నియంత్రణ మండలికే ఉంటుందని పేర్కొంది. కాగా ఫీజు నిర్ణయాధికారం కళాశాలలకే ఇవ్వాలని కళాశాల తరపు న్యాయవాది కోరారు. ఫీజు నిర్ణయంపై వాసవి కళాశాల తరపు న్యాయవాది వాదనలతో సుప్రీం ఏకీభవించలేదు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. ప్రైవేటు కళాశాలలు ఎలా నడుస్తాయో తమకు తెలుసని పేర్కొంది. అధ్యాపకులు లేకున్నా కొన్ని కళాశాలలు ఉన్నట్లు చెబుతాయంది. కళాశాలలు ఫీజులు నిర్ణయిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో తమకు తెలుసు అన్నారు. ఫీజుకు సంబంధించి సమగ్ర వివరాలు అందించాలని పిటిషనర్లు వాసవి కళాశాల పేరెంట్స్‌ అసోషియేషన్‌, తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం ఆదేశాలు జారీచేసింది. తదుపరి విచారణను ఏప్రిల్‌ 9కి వాయిదా వేసింది.


మరిన్ని తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/