ఫ్రాన్స్‌లో నిరసనలు..ఆర్థిక వ్యవస్థ పై ప్రభావం

France protests
France protests

పారిస్‌ : ఫ్రాన్స్‌ గత కొన్ని రోజులుగా సమ్మెలు, నిరసనలతో అట్టుడుకుతోంది. దీని ప్రభావం ఆ దేశ ఆర్థిక వ్యవస్థ పైన కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది. ఫ్రెంచ్‌ ప్రభుత్వం అంగీకరించింది. ఐరోపా కూటమిలో పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటైన ఫ్రెంచ్‌ ఆర్థిక వ్యవస్థ తొలిసారిగా మాక్రాన్‌ నేతృత్వంలో 2019 చివరి త్రైమాసిక కాలంలో తన నిర్దేశిత లక్ష్యసాధనలో విఫలమైందని ఫ్రాన్స్‌ జాతీయ గణాంకాల బ్యూరో వెల్లడించింది.. ఈ త్రైమాసిక కాలంలో ఫ్రాన్స్‌ వాస్తవిక జిడిపి 0.1 శాతం మేర పడిపోయినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అంతకు ముందు జులైసెప్టెంబర్‌ త్రైమాసిక కాలంలో 0.3 శాతం విస్తరించిన విషయం గమనార్హం. జిడిపి ‘స్వల్పం’గా పతనమైనప్పటికీ, ముందుగా నిర్దేశించుకున్న 0.2 శాతం వృద్ధి రేటు ఫలితాలను సాధించామని గణాంకాల విభాగం వివరించింది. అయితే అంతకు ముందు ఏడాది 1.7 శాతం మేర నమోదయిన రేటు వృద్ధి 2019లో 1.2 శాతం మేర తగ్గటం విశేషం. అనూహ్యమైన ఈ మాంద్యం ఎగుమతులు, దిగుమతుల తగ్గుదలతో ఎదురైనట్లు గణాంకాల సంస్థ వెల్లడించింది. గత కొంతకాలంగా దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు కూడా ఆర్థిక వ్యవస్థను కుంగదీశాయని, సమ్మెలతో ఫ్రెంచ్‌ ఆర్థిక వ్యవస్థ 0.1 శాతం మేర నష్టపోయిందని, రాజకీయ అనిశ్చితితో జిడిపి 0.2 శాతం మేర తగ్గిందని అలియన్జ్‌ గ్రూప్‌ ఛీఫ్‌ ఎకనామిస్ట్‌ లుడోవిక్‌ సుబ్రాన్‌ వివరించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/