ప్రియాంక రెడ్డి హత్యపై ఢిల్లీలో ఆందోళనలు

women protests
women protests

ఢిల్లీ: భారతదేశంలో మహిళలు నిజంగా సురక్షితంగా ఉన్నారా లేదా అనే అంశం మరోసారి చర్చకు దారి తీసింది. శంషాబాద్‌లో యువ వైద్యురాలుపై అత్యాచారం చేసి హత్య చేసిన నేపథ్యంలో దేశ రాజధాని అయిన ఢిల్లీలో ఆందోళనలు వెల్లువెత్తున్నాయి. పలు స్వచ్ఛంద సంస్థలు, మహిళా సంఘాలు నిందితులకు ఉరిశిక్ష వేయాలంటూ డిమాండ్‌ చేస్తున్నాయి. పార్లమెంట్‌ స్ట్రీట్‌లో యువత భారీ ఎత్తున ఆందోళనలు చేపట్టింది. నిందితులను కఠినంగా శిక్షించాలని రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఇలాంటి ఘటనలు పునవావృతం కాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మరోవైపు సోషల్‌ మీడియాలో సైతం యువత స్పందిసూ..హంతకులకు మరణశిక్ష విధించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ ఉదంతంపై తీవ్ర స్థాయిలో ఆందోళనలు రేకెత్తున్నాయి. షాద్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ వద్దకు చేరుకొని పలు ప్రజా సంఘాలు నిరసనలు తెలిపాయి.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/