మంత్రి మల్లారెడ్డి కి నిరసన సెగ

మంత్రి మల్లారెడ్డి కి నిరసన సెగ ఎదురైంది. మేడ్చల్ జిల్లా సమీకృత కలెక్టరేట్ ఆఫీస్ లో షీ క్యాబ్ పంపిణీ కార్యక్రమానికి వచ్చిన మంత్రి మల్లారెడ్డిని డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం భూములు కోల్పోయిన అంతయిపల్లి రైతులు నిలదీశారు. మంత్రి మల్లారెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. భూములు కోల్పోయిన రైతులకు న్యాయం చేయాలని మంత్రిని మహిళలు నిలదీశారు. మంత్రికి వినతి ఇచ్చి బాధలు చెప్పుకోవడానికి వెళ్తే పోలీసులు అడ్డుకొని మల్లారెడ్డిని కలవనీయకుండా చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తంచేశారు.

అనంతరం మల్లారెడ్డిని కలిసి రైతులకు వినతి పత్రం అందజేశారు. తమకు న్యాయం చేయకపోతే ఆత్మహత్యలు చేసుకుంటామని హెచ్చరించారు. రేపు బాధిత రైతులను తమ ఇంటి వద్దకు రమ్మని పేపర్లు అన్నీ పరిశీలించాక సీఎంతో, కలెక్టర్ తో మాట్లాడి తక్షణమే సమస్యను పరిష్కరించి న్యాయం చేస్తామని మల్లారెడ్డి హామీ ఇవ్వడంతో వారంతా శాంతించారు.