ప్రోటీన్స్ పుష్కలం

ఆహారం-ఆరోగ్యం

proteins food items
proteins food items

చికెన్‌, మటన్‌, గుడ్లు వీటిలో ప్రొటీన్‌ పుష్కలంగా ఉంటాయి అయితే కొందరు వీటిని తినేందుకు ఇష్టపడరు. కానీ ప్రొటీన్స్‌ అందరికీ తప్పనిసరిగా అవసరం.

ఎందుకంటే మనకు ఎనర్జీ ఉండాలన్ని మనం పనులు చేసుకోవాలన్నా కండరాలు బలంగా ఉండాలన్నా బాడీలో ప్రొటీన్స్‌ లేకపోతే కష్టం.

అబ్బాయిలు రోజుకు 56 గ్రాములు ప్రొటీన్స్‌తీసుకోవాలి. అమ్మాయిలకైతే 46 గ్రాముల ప్రొటీన్స్‌కావాలి.

చికెన్‌, మటన్‌ తినే వారికి ప్రొటీన్స్‌లోపం ఉండదు. కనీసం గుడ్లయినా తింటు ఈ లోపాన్ని కవర్‌చేసుకోవచ్చు.

ఇవేవీ తినడం ఇష్టం లేని వారు ప్రత్యేక ఆహారం తీసుకోవాలి. బలంగా, ఎనర్జీతో ఉన్నప్పుడు ఏ అనారోగ్య సమస్యలు రావు.

ప్రొటీన్స్‌ కోసం ఎలాంటి శాఖాహారం తీసుకోవాలో చూద్దాం.. వేరుశెనగలో ప్రొటీన్స్‌ బాగా ఉంటాయి. వంద గ్రాముల వేరుశెనగలో 26 గ్రాముల ప్రొటీన్స్‌ ఉంటాయి.

బాదం పప్పుల్లో విటమిన్స్‌, మినరల్స్‌, ప్రొటీన్‌ ఎక్కువగా ఉంటాయి. వంద గ్రాముల బాదంలో 21.15 గ్రాముల ప్రొటీన్స్‌ ఉంటాయి.

అదే వంద గ్రాముల గుడ్లలో 11 గ్రాముల ప్రొటీన్సే ఉంటాయి. అయితే బాదం పప్పులు ఎక్కువగా తింటే వేడి చేస్తాయి.

కాబట్టి రోజుకు నాలుగు దాకా తినవచ్చు. శెనగలు రాత్రంతా నానబెట్టి తెల్లారి తింటే ఫుల్‌ఎనర్జీ. వంద గ్రాముల శనగల్లో పదిహేడు గ్రాముల ప్రొటీన్‌ ఉంటాయి.

ఓట్స్‌లో ఫైబర్‌, మెగ్నీషియం, మాంగనీస్‌, థయామిన్‌, విటమిన్‌ బివన్‌ ఉంటాయి.

వందగ్రాముల ఓట్స్‌లో 16.9గ్రాముల ప్రొటీన్స్‌ ఉంటాయి. వందగ్రాముల పన్నీర్‌లో 14 గ్రాముల ప్రొటీన్స్‌ ఉంటాయి. వందగ్రాముల రాజ్మాలో తొమ్మిది గ్రాముల ప్రొటీన్స్‌ ఉంటాయి.

వంద గ్రాముల క్వినోవాలో 4.4 గ్రాముల ప్రొటీన్స్‌ ఉంటాయి. బ్రకోలీ నిండా పోషకాలే. వంద గ్రాముల బ్రకోలీలో 2.8 గ్రాములు ప్రొటీన్స్‌ ఉంటాయి.

తాజా బిజినెస్‌ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/