మానవ హక్కుల పరిరక్షణకు మరింత కృషి

మానవ హక్కుల పరిరక్షణకు మరింత కృషి
Human Rights

సమాజమంటే వ్యక్తుల సమూహం. సమాజంలో ఉండే ప్రతీ ఒక్కరు స్వేచ్ఛ, స్వాతం త్య్రాలతో జీవించిన నాడే మానవ జీవితాలకు సార్థకత. స్వేచ్ఛ అనేది కేవలం వ్యక్తిగతమైనదే కాదు, సం ఘంతో ముడిపడి ఉన్నది కూడా. మన స్వేచ్ఛా స్వాతంత్య్రాలు ఇతరు లకు ఇబ్బందిగా మారితే అలాంటి స్వేచ్ఛకు అర్థం లేదు. అలాంటి స్వేచ్ఛ సమాజానికే గొడ్డలిపెట్టు. ప్రాచీన కాలం నుండి చాలా దేశాలు ఆయా దేశాలలోని కట్టు బాట్లు, నియమ నిబంధనల వలన స్వేచ్ఛాస్వాతంత్య్రాలకు దూరం కావడం వలన బానిసత్వంతో నలిగిపోయాయి.

ఆయా దేశాలలో కొనసాగిన అణచివేత, నియంతృత్వ భావాల వలన ప్రజలంతా బిక్కుబిక్కుమంటూ బతికేవారు. యుద్ధాల వలన, జాత్యంకార జాఢ్యాల వలన ఎన్నో దేశాలు అభివృద్ధికి నోచుకోకుండా అణగ ద్రోక్కబడ్డాయి. కాలక్రమేణా ప్రపంచంలో మార్పులు సంభవిం చాయి. ఆయా దేశాలలోని విద్యావంతమైన యువత ఆలోచనా ధోరణిలో మార్పువచ్చింది. మనిషి జీవితమంటే ఇతరుల చేతిలో కీలుబొమ్మగా మారడమేనా అనే మీమాంస బయలుదేరింది. స్వేచ్ఛ స్వాతంత్య్రాల కోసం, హక్కులకోసం అనేక ఉద్యమాలు జరిగాయి.

వాటి ఫలితమే భారతదేశం లాంటి అనేక దేశాలు పరాయి దేశాల పీడన నుండి విముక్తి చెందాయి. ప్రతి దేశం తమ దేశంలోని ప్రజల మనోభీష్టాలకు, సక్రమ పాలనకు అనుగుణంగా రాజ్యాంగ రూపంలో కొన్ని నియమ నిబంధనలు ఏర్పాటు చేసుకున్నాయి. ముఖ్యంగా భారతదేశం లాంటి భిన్న వైరుధ్యాలు గల దేశాలలో రాజ్యాంగం నిబంధనలు అమలు చేయాలంటే చాలా క్లిష్టతరం. అయినప్పటికీ మనదేశంలోని మేధావ్ఞల వలన, ప్రాచీన కాలం నుంచి వస్తున్న సంస్కారం, సహనం వంటి భావాల వల్ల రాజ్యాం గం చాలా వరకు సక్రమంగానే అమలు చేయబడుతున్నది. అయినప్పటికీ దేశంలో కొన్ని కొన్ని విబేధాలు తలెత్తుతూనే ఉన్నా యి.

భిన్నమతాలు, భిన్నకులాలు, విభిన్న సంస్కృతుల సమాహార మైన దేశంలో కొన్ని సంఘర్షణలు జరగడం సహజం. అయినప్ప టికీ మనదేశంలో భిన్నత్వంలో ఏకత్వ సిద్ధాంతం సక్రమంగానే అమలు చేయబడడం హర్షదాయకం. ప్రతి దేశం తమకుంటూ ఒక రాజ్యాంగం ఏర్పాటు చేసుకుని పరిపాలన సాగిస్తున్నాయి. అయితే అతికొద్ది దేశాల్లో మాత్రమే ప్రజల హక్కులు కాపాడబడుతున్నాయి. చాలా చోట్ల నియంతృత్వపోకడల వలన మానవహక్కులు హరించ బడుతున్నాయి. మానవ హక్కులకు రక్షణ లేని దేశాలలోని ప్రజల బతుకులు దుర్భరం.

యుద్ధనేరాల పేరుతోనో, రాజ్యహింస, రాజ కీయ కక్షల వలన చాలా మంది తమ స్వేచ్ఛాస్వాతంత్య్రాలను కోల్పోయి, చెరసాలల్లో మగ్గిపోతున్నారు. బానిసత్వం, అణచివేత, స్త్రీ,పురుష లింగవివక్షత, అవిద్య, అనాగరిక పద్ధతుల వలన మూర్ఖభావజాలం వలన చాలా మంది ప్రజలు ఆటవిక న్యాయం లో మానవ్ఞలుగా తమకున్న హక్కులను కోల్పోయి బానిసలుగా అణగద్రొక్కబడుతున్నారు. ఇలాంటి భావాల నుండి, నియంతృత్వ పోకడల నుండి ప్రజలను రక్షించాలనే సద్దుదేశ్యంతో ఐక్యరాజ్య సమితి విశాల దృక్పథంతో మానవ హక్కులను కాపాడే ప్రయ త్నాలు చేయడం హర్షదాయకం. అయితే ఉగ్రవాదుల బెడదతో నిరంతరం బాధపడుతున్న భారతదేశాన్ని ఐక్యరాజ్యసమితి కానీ, అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు కాని ఏనాడూ సరిగా పట్టించుకున్న పాపానపోలేదు.

పైగా మానవ హక్కులను కాలరాస్తున్నారంటూ చాలాకాలం మానవ హక్కుల సంఘాలు భారత్‌పై గొంతెత్తి అరిచాయి. అగ్రరాజ్యాల్లో జరుగుతున్న మానవహక్కుల ఉల్లంఘన గురించి ఐక్యరాజ్యసమితి స్పందన పేలవంగా ఉంటున్నది. అగ్రరాజ్యాల నిధులతో మనుగడ సాగించాలనే దృక్పథం వలనో, భయం వలనో ఐరాస వాటిజోలికి పోవడం లేదు. చైనా అభ్యంతరంతో భద్రతా మండలిలో మన దేశానికి శాశ్వత సభ్యత్వం ఎడారిలో ఎండమావిలా తయారైంది. కొన్ని దేశాల గుప్పిట్లో ఐక్యరాజ్యసమితి కీలుబొమ్మగా మారడం దురదృష్టకరం.

అన్నిదేశాల సమన్వయంతో పనిచేయకుండా అగ్రరాజ్యాల క్రీనీడలో పనిచేయాలనుకుంటే ‘లీగ్‌ ఆఫ్‌ నేషన్స్‌ మాదిరిగా ఐరాస కూడా అంతరించిపోయే ప్రమాదం ఉంది. సమాజంలో ప్రతి వ్యక్తి స్వేచ్ఛగా, గౌరవంగా సకల హక్కులతో జీవించే పరిస్థితులు లేనప్పుడు అరాచక పరిస్థితులు తలెత్తుతాయి. ప్రభుత్వాలు, ప్రజలు కూడా మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్ప డకూడదంటే అందుకు తగిన పరిస్థితులు సమాజంలో నెలకొల్పా లి. ప్రతిఒక్కరూ చట్టాలను గౌరవించాలి. చట్టాలను గౌరవించక పోతే సమాంతర ప్రభుత్వాలు రూపుదిద్దుకుంటాయి.

ఇది చాలా ప్రమాదకరం. చట్టపరిధిలోనే,రాజ్యాంగానికి లోబడి అన్ని సమస్యలు పరిష్కరించబడాలి. న్యాయం కోసం సుదీర్ఘనిరీక్షణ మంచిదికాదు. కాలయాపన వల్లనే ప్రజల్లో నిరాశానిస్పృహలు ఏర్పడి, చట్టవిరుద్ధ చర్యలకు పాల్పడే అవకాశం ఉంది. చట్టవిరుద్ధ చర్యల వలన భవిష్యత్తులో అమాయకులే ఎక్కువగా నష్టపోయే పరిస్థితులు ఏర్పడతాయి. మానవ హక్కులు హరించబడే ప్రమాదం ఉంది. అందువలన ప్రతీ సమస్యకు రాజ్యాంగపరిధికి లోబడి ఆమోదయోగ్యమైన ముగింపు పలకాలి. తక్షణ పరిష్కారం చట్టపరిధిలోనే జరగాలి. బాధితులకు సకాలంలో న్యాయం అందినప్పుడే చట్టాల పట్ల ప్రజలకు గౌరవం పెరుగుతుంది.

  • సుంకవల్లి సత్తిరాజు

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/