ఇంట్లో ఉన్నా రక్షణ ముఖ్యం

పిల్లలు, వృద్ధుల పట్ల జాగ్రత్త అవసరం

The Famlily
The Famlily

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా ఎవరినీ వదలడం లేదు. ఈ వైరస్‌ బారిన పడకుండా వయసు పై బడిన వారు జాగ్రత్తగా ఉండడం మేలు.

ఇతరులతో పోలిస్తే ఈ వైరస్‌ పట్ల వృద్ధులు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముంది.

అందుకు అవసరమైన జాగ్రత్తలతో పాటు కొన్ని రక్షణ చర్యలు పాటిస్తే మంచిది. ఇంట్లోనే ఉండాలి. అయితే ఇంటికి వచ్చిన వారితో దూరంగా ఉండటం మంచిది.

తప్పనిసరైతే రెండు మీటర్ల దూరం పాటించి పలకరిస్తే సరి.

ఈ వైరస్‌ వల్ల చేతులను తరచుగా కడగటం చేయాలని వైద్యులు ఇప్పటికే అందరికీ సూచించారు. పెద్దవారు చేతులు కడగటంతో పాటు సబ్బుతో ముఖం కూడా కడుక్కోవాలి.

మోచేతిని అడ్డం పెట్టుకుని, లేదా టిష్యూపేపర్‌, చేతిరుమాలుతో పెట్టుకుని తుమ్మాలి.

వాడిన టిష్యూపేపర్‌ అయితే మూత ఉన్న చెత్త డబ్బాలో వేయాలి. చేతి రుమాలు అయితే తిరిగి వాడకుండా శుభ్రంగా ఉతికిన తరువాతే వాడాలి.

ఇంట్లో వండిన పదార్థాలను వేడిగా తీసుకోవాలి. పోషకాహారం తినాలి.

ఎక్కువగా నీళ్లు తాగుతుండాలి. వ్యాధినిరోధక శక్తి కోసం పళ్ల రసాలు తీసుకుంటే మంచిది. డాక్టర్‌ సూచించిన మందులను క్రమం తప్పకుండా వాడుతుండాలి.

దూరంగా ఉన్న బంధువ్ఞలు, స్నేహితులతో ఫోన్‌, వీడియోకాల్స్‌లో మాట్లాడితే కొంత ఉత్సాహంగా ఉంటుంది.

చేయించుకోవాల్సిన సర్జరీలు ఉంటే ప్రస్తుతం వీలు పడదు కాబట్టి వాయిదా వేసుకుని జాగ్రత్తలు పాటించడం మంచిది.

తలుపు, గడియలు తాకాల్సి ఉంటుంది కాబట్టి వాటిని ఇంట్లో ఉండే డెటాల్‌ వంటి వాటితో శుభ్రం చేస్తుండాలి. దగ్గు, జ్వరం, శ్వాస సంబంధ ఇబ్బందులు ఉంటే ఆలస్యం చేయకుండా దగ్గరలోని డాక్టర్‌ను సంప్రదించడం చేయాలి.

తుమ్మినపుడు అరచేతులు అడ్డుపెట్టుకుని తుమ్మకూడదు. జ్వరంగా అనిపిస్తే ఎవరిని దగ్గరగా తాకకూడదు. దూరంగా ఉండి సహాయం కోరాలి.

నాలుక, ముక్కు, కళ్లను చేతులతో తాకకూడదు. సొంత వైద్యం మంచిది కాదు.

ఎంత దగ్గరి వాళ్లయినా సరే ఇతరులతో కరచాలనం, గుండెకు హత్తుకోవడం వంటివి అస్సలు చేయకూడదు.

లాక్‌డౌన్‌ వల్ల బయటికి వెళ్లలేని పరిస్థితులు ఉన్నాయి కాబట్టి రెగ్యులర్‌ చెకప్‌లకు డాక్టర్‌ను ఫోన్‌లో సంప్రదించడం మంచిది.

తాజా తెలంగాణ వార్తల కోసం :https://www.vaartha.com/telangana/