ఆర్థిక పునరుద్ధరణకే ఈ ఉద్ధీపనలు

కేంద్ర ప్రభుత్వ ఆర్థిక ప్యాకేజీ

for economic recovery
for economic recovery

ఆర్థికమంత్రి వరుసగా ఐదురోజులు చేసిన ప్రకటనలు, ఉద్దీపన సంస్కరణలు వివేకవంతమైన కలయికకు తోడ్పడ్డాయి.

కొవిడ్‌-19 సంక్షోభం కారణంగా ఎదురయ్యే స్వల్పకాలిక సవాళ్ల పరిష్కారంతో పాటు, లాక్‌డౌన్‌ తరువాత ఆర్థిక పునరుద్దరణకు ఉత్ప్రేరకంగా పనిచేసే అవకాశం ఉన్న ముఖ్యమైన విధాన సంస్కరణలతోపాటు వ్యాపార సంస్థలకు మధ్యస్థ మద్ధతు పలకాలనే లక్ష్యంతో బాగా ఆలోచించి ఈ ప్యాకేజీని సమర్పించారు.

స్వల్పకాలిక ఇబ్బందుల తక్షణ పరిష్కరించడానికి, ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌యోజన (పిఎంజికెవై) ద్వారా నగదు సహాయంతో పాటు, ప్రజలకు, సంస్థలకు పన్ను రాయితీలు, ఇపిఎఫ్‌ మద్దతు ఇవ్వడం జరిగింది.

లాక్‌డౌన్‌ కారణంగా బకాయిలను నివారించడానికి వ్యక్తులు, సంస్థలకు, పన్ను గడువ్ఞలో సడలింపుతోపాటు తాజా కార్యకలాపాలను నిలిపివేయడం వంటి చర్యల ద్వారా తక్షణ నియంత్రణ ఉపశమనం కూడా అందించబడింది.

వ్యవసాయరంగంలో సంస్కరణలు, నిత్యావసర వస్తువ్ఞల చట్టంలో సవరణలతోపాటు వ్యవసాయ మార్కెటింగ్‌ సంస్కరణలు బలోపేతం చేయడం వల్ల వ్యవసాయ ఉత్పాదకత పెరుగుతుంది.

రైతులకు మెరుగైన ధర లభిస్తుంది. క్లిషమైన ప్రాముఖ్యత కలిగిన మైనింగ్‌రంగం ప్రధాన పెట్టుబడులను కోల్పోతున్న తరుణంలో, బొగ్గు వాణిజ్య మైనింగ్‌ విధానాన్ని సరళీకృతం చేయమని సి.ఐ.ఐ. అభ్యర్థించింది.

మైనింగ్‌రంగంలో ప్రకటించిన సంస్కరణల వల్ల ఈ రంగంలో పెట్టుబడులు పెరగడంతోపాటు, భారతదేశంలో మైనింగ్‌ కార్యకలాపాలకు ప్రపంచస్థాయి మైనింగ్‌ సంస్థలు వచ్చే అవకాశం కలుగుతుంది.

పెట్టుబడి ఆకర్షణకు సంబంధించి పారిశ్రామిక మౌలిక సదుపాయాల పెంపు, రాష్ట్రాల ర్యాంకింగ్‌, ఇతర చర్యలతోపాటు పెట్టుబడిదారులకు సౌకర్యాలు కల్పించడం స్వాగతించదగిన చర్య.

అదేవిధంగా సుంకం విధానంలో సంస్కరణలు విద్యుత్‌రంగం అభివృద్ధికి మార్గం సుగమం చేస్తాయి.

దీర్ఘకాలిక లాక్‌డౌన్‌ కారణంగా ఎమ్‌.ఎస్‌.ఎమ్‌.ఈ.లు ఎదుర్కొంటున్న తీవ్ర ఒత్తిడిని పరిశీలిస్తే, ఇబ్బందులకు గురైన ఈ రంగానికి సహాయపడటానికి ఈ ఉద్దీపన ప్యాకేజీలో అనేక చర్యలు ఉన్నాయి.

ఎమ్‌.ఎస్‌.ఎమ్‌.ఈ.లకు పెండింగ్‌లో ఉన్న అన్ని బకాయిలను 45 రోజుల్లోపు తగ్గించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పలు ఇబ్బందుల్లో ఉన్న ఈ సంస్థలకు గణనీయమైన ఉపశమనాన్ని కలిగిస్తుంది.

అయితే, ఎమ్‌.ఎస్‌.ఎమ్‌.ఈ.ల పునర్నిర్మాణంలో ప్రతిపాదిత టర్నోవర్‌ పరిమితిని పునఃపరిశీలించవలసిన అవసరం ఉంది.

ఈ ప్యాకేజీ ఇతర ముఖ్యమైన భాగాలలో ప్రజార్యోగం, ప్రభుత్వరంగ సంస్థలు, రక్షణ, రియల్‌ ఎస్టేట్‌ నిర్మాణానికి సంబంధించినవి ఉన్నాయి.

గ్రామీణ ప్రాంతాలకు తిరిగి వస్తున్న వలసదారులు జీవనోపాధి పొందగలిగేలా ఎం.ఎన్‌.ఆర్‌.ఇ.జి.ఎ.కి కేటాయింపులు పెంచారు.

ఈ మొత్తం ప్యాకేజీ అమలైతే క్రమంగా ఆర్థిక పునరుద్దరణకు దారితీస్తుందని పరిశ్రమ విశ్వసిస్తోంది.

వలస కార్మికుల కోసం అద్దె గృహనిర్మాణ పథకాన్ని ప్రకటించడం దీర్ఘకాలికంగా వారి స్థితిలో అర్థవంతమైన మార్పుకు దారితీస్తుంది.

వీటిలో చాలావరకు నిర్మాణాత్మక సంస్కరణల కోసం పరిశ్రమ ఎదురుచూస్తోంది

. వీటిని సమయస్ఫూర్తితో నిర్వహిస్తే, ఆర్థిక వ్యవస్థ పోటీతత్వంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది.

ఆర్థిక వ్యవస్థ ఒకసారి కోలుకుంటే, అది బలంగా, మరింత పోటీగా నిలుస్తుంది. ఈ ఉద్దీపన ప్యాకేజీలోని 20 లక్షల కోట్లు ఖర్చయితే, అదనంగా ఇది ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన సానుకూల ప్రభావాన్ని చూపుతుంది.

రచయిత: చంద్రజిత్‌ బెనర్జీ, డైరక్టర్‌ జనరల్‌, సి.ఐ.ఐ.

తాజా కెరీర్‌ సమాచారం కోసం : https://www.vaartha.com/specials/career/