గుడ్ న్యూస్ : APSRTC ఉద్యోగులకు త్వరలో పదోన్నతులు

గుడ్ న్యూస్ : APSRTC ఉద్యోగులకు త్వరలో పదోన్నతులు

APSRTC ఉద్యోగులకు గుడ్ న్యూస్ తెలుపబోతున్నారు జగన్ సర్కార్..గత కొన్ని నెలలుగా పదోన్నతుల కోసం ఉద్యోగులు ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఎదురుచూపులకు అతి త్వరలో తెరపడనుంది. త్వరలో వారందరికీ పదోన్నతులు కల్పించేందుకు రాష్ట్ర సర్కార్ కసరత్తు మొదలుపెట్టింది. వెయ్యిమందికి పైగా పదోన్నతులు లభించనున్నాయి. అధికారుల స్థాయిలో తక్కువగా.. ఉద్యోగులు, కార్మికుల స్థాయిలో ఎక్కువ పదోన్నతులు ఇచ్చేందుకు సర్కార్ సన్నాహాలు చేస్తుంది.

సీనియర్‌ అసిస్టెంట్లు, అసిస్టెంట్‌ డిపో మేనేజర్లు, కంట్రోలర్లు, గ్యారేజ్‌ సూపర్‌వైజర్లు, ట్రాఫిక్‌ సూపర్‌వైజర్లు , మెకానిక్‌లు, జూనియర్‌ అసిస్టెంట్లు తదితర ఉద్యోగులు ఎక్కువ మందికి ప్రయోజనం కలిగే విధంగా పదోన్నతుల ప్రక్రియను ఆర్టీసీ యాజమాన్యం సూత్రప్రాయంగా ఆమోదించింది. ప్రతి ఒక్కరికీ ఒక ర్యాంకు పెరగనుంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత తొలిసారిగా పదోన్నతులు కల్పించనుండటంతో ప్రాధాన్యం సంతరించుకుంది.