లాభం రూ.151 కోట్లు

యస్‌ బ్యాంక్‌ వెల్లడి

YES Bank
YES Bank

Mumbai: ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక ఫలితాలను ప్రైవేటురంగ యస్‌ బ్యాంక్‌ ప్రకటించింది. రూ.151.71 కోట్ల లాభాన్ని ఆర్జించామని బ్యాంక్‌ వెల్లడించింది. అంతక్రితం ఏడాది ఇదే సమయంలో రూ.18,560 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించామని ప్రస్తావించింది.

సెప్టెంబర్‌ త్రైమాసికంలో లాభం రూ.129 కోట్లుగా ఉందని తెలిపింది. సమీక్షాల కాలం నాటికి బ్యాంక్‌ వడ్డీ ఆదాయం 30 శాతం మేర వృద్ధి చెంది రూ.2,560 కోట్లుగా నమోదయింది. సెప్టెంబర్‌ త్రైమాసికంలో వడ్డీపై ఆదా యం రూ.1,973 కోట్లుగా ఉందని తెలిపింది.

గత త్రైమాసికంతో పోల్చితే వడ్డీ యేతర ఆదాయం 69.5 శాతం మేర పెరిగి రూ.1197 కోట్లుగా రికార్డయింది. రిటైల్‌ ఫీజులు పెరుగుదలతో వడ్డీయేతర ఆదాయం గణనీయమైన ఈ స్థాయిలో పెరుగుదలకు కారణమని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది. 

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/