ఇక్కడే తెలుగు భాషకు మర్యాద: యార్లగడ్డ

Prizes Distribution to Winners
Prizes Distribution to Winners

Washington DC:
ఉత్తర అమెరికా తెలుగు సంఘం 22వ మహాసభలను పురస్కరించుకుని పాఠశాల-తానా కలిసి వివిధ నగరాల్లో ఉన్న చిన్నారులకు తెలుగు భాషపై తెలుగు పోటీలను నిర్వహించిన సంగతి తెలిసిందే. వివిధ నగరాల్లో జరిగిన పోటీల్లో పాల్గొని విజేతలుగా నిలిచినవారికి వాషింగ్టన్‌ డీసీలో జరిగిన 22వ మహాసభల్లో సెమిఫైనల్‌, ఫైనల్‌ పోటీలను నిర్వహించారు. విజేతలకు బహుమతుల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. పాఠశాల వ్యవస్థాపక చైర్మన్‌ జయరామ్‌ కోమటి, పాఠశాల సిఇఓ చెన్నూరి వెంకట సుబ్బారావు, ముఖ్య అతిధులుగా యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌, గుమ్మడి గోపాలకృష్ణ పాల్గొన్నారు.
ముఖ్య అతిధిగా వచ్చిన యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ మాట్లాడుతూ, గతంలో అమెరికాకు వచ్చిన కొత్తలో తెలుగుభాషను మాట్లాడేవారు తక్కువ. మా ఇంట్లోనే మా అబ్బాయి పిల్లలు మాట్లాడే భాష మాకు అర్థమయ్యేది కాదు. దాంతో నా భార్య ఇక్కడ ఉండటానికి ఇష్టపడటం లేదని, కాని పరిస్థితులు మారాయి. తెలుగు రాష్ట్రంలో తెలుగు భాషను మాట్లాడేవారు తక్కువయ్యారు. అమెరికాలో తెలుగు భాషను పరిరక్షించుకునేవారు ఎక్కువయ్యారు. దాంతో ఇక్కడే తెలుగు భాషకు మర్యాద లభిస్తోంది. పాఠశాల కూడా తెలుగు భాష బోధనలో విశేష కృషి చేస్తోందని ప్రశంసించారు.