ప్రియుడి పెళ్లిలో హల్చల్ చేసిన ప్రేమికురాలు

ప్రేమించినవాడు మరో పెళ్లి చేసుకుంటున్నాడని తెలిసి కోపం తో ఆ పెళ్లి ని అడ్డుకునే ప్రయత్నం చేసింది ప్రేమించిన యువతీ..యువతీ అడ్డుకొనే ప్రయత్నం చేయడం తో ప్రియుడు బంధువులు ఆమె ఫై దాడి చేసిన ఘటన ఖమ్మం జిల్లా గార్ల లో చోటుచేసుకుంది. గార్ల మండలానికి చెందిన రజిని అనే మహిళను శ్రీనాధ్ అనే వ్యక్తిని ప్రేమించింది. ఇద్దరు పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. కానీ గత కొద్దీ రోజులుగా శ్రీనాధ్ ఆమెను కలవడం కానీ , ఫోన్ చేయడం కానీ చేయడం లేదు.

ఈ క్రమంలో అతడు శుక్రవారం వేరే అమ్మాయితో పెళ్లికి సిద్ధమయ్యాడని తెలిసి..పెళ్లి ని అడ్డుకునేందుకు రజిని వెళ్ళింది. అయితే… మండపంలోకి వచ్చేందుకు ప్రయత్నించగా రజినీని విచక్షణ రహితంగా కొట్టారు శ్రీనాధ్‌ బంధువులు. జుట్టు పట్టి ఈడ్చుకుంటూ వెళ్లారు. ప్రియుడు శ్రీనాధ్ ను ప్రేమించానని..పెళ్లి చేసుకుంటానని మాయ మాటలు చెప్పి మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. అయినా వినిపించుకోకుండా ఆమెను కొట్టారు. ఇంత జరుగుతున్నా.. అక్కడున్న వారు ఎవరూ స్పందించలేదు. ఈ ఘటన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.