యూపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డా వాద్రా

Robert Vadra
Robert Vadra

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని శుక్రవారం పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై ప్రియాంక భర్త రాబర్ట్‌ వాద్రా స్పందించారు. నా భార్య, కాంగ్రెస్‌ నేత ప్రియాంక గాంధీని అరెస్టు చేసిన తీరు రాజ్యాంగ విరుద్ధం. అరెస్టుకు సంబంధించి ఎలాంటి పత్రాలు సమర్పించలేదు. ఇది పూర్తిగా చట్టాన్ని దుర్వినియోగం చేయడం కిందికే వస్తుంది. చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించడం నేరమా? నిజం వైపు నిలబడిన ప్రతి గొంతును ఈ ప్రభుత్వం అణగదొక్కుతుందా! రాష్ట్ర ప్రభుత్వం ఆమెను వెంటనే విడుదల చేయాలి. ప్రజాస్వామ్యాన్ని అలాగే ఉండనివ్వండి. నియంతృత్వంగా మార్చకండి అని వాద్రా యూపీ ప్రభుత్వం మీద విరుచుకుపడ్డారు. దీనిపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా ట్విటర్‌ వేదికగా స్పందించారు. యూపీలోని బిజెపి ప్రభుత్వంలో అభద్రతా భావం పెరిగిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాజా ఆద్యాత్మికం వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/devotional/