హత్రాస్‌ వెళ్లేందుకు రాహుల్‌, ప్రియాంకకు అనుమతి

Priyanka, Rahul Gandhi Allowed To Go To Hathras To Meet Victim Family

న్యూఢిల్లీ: హత్రాస్‌ బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు రాహుల్, ప్రియాంకకు అనుమతి లభించింది. వీరితో పాటు మరో ముగ్గురికి మాత్రమే పోలీసులు అనుమతినిచ్చారు. హత్రాస్ లో 144 సెక్షన్ అమలులో ఉందని, అందుకే ఐదుగురికి మాత్రమే అనుమతించామని పోలీసులు పేర్కొంటున్నారు. అయితే రాహుల్, ప్రియాంక బయల్దేరిన నేపథ్యంలో వారి వెంట కార్యకర్తలు కూడా తరలివచ్చారు. అయితే కార్యకర్తలందర్నీ ఢిల్లీ టోల్‌గేట్ వద్ద పోలీసులు నిలిపివేశారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాగా ఈ ప్ర‌పంచంలో త‌న‌ను ఎవ‌రూ ఆప‌లేర‌ని, హ‌త్రాస్ బాధితురాలి కుటుంబాన్ని ప‌రామ‌ర్శించేందుకు వెళ్తున్నాన‌ని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. రెండు రోజుల క్రితం హ‌త్రాస్‌కు బ‌య‌ల్దేరిన రాహుల్‌, ప్రియాంక గాంధీల‌ను యూపీ పోలీసులు అడ్డుకున్న విష‌యం తెలిసిందే.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/