ప్రియాంక కేసు నిందితులకు రిమాండ్‌

victims
victims

హైదరాబాద్‌: వైద్యురాలు ప్రియాంక రెడ్డి కేసులోని నిందితులను ఈ రోజు మేజిస్ట్రేట్‌ ముందు ప్రవేశ పెట్టాలి. కానీ షాద్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ వద్ద వెల సంఖ్యలో ఆందోళనకారుల నిరసనలు వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. కాగా ఈ నేపథ్యంలో నిందితులను బయటకు తీసుకురావడం సురక్షితం కాదని భావించిన పోలీసులు మేజిస్ట్రేట్‌ పాండు నాయక్‌(మండల తహశీల్దార్‌)ను పోలీస్‌ స్టేషన్‌కు తీసుకు వచ్చారు. కాగా కేసును విచారించిన మేజిస్ట్రేట్‌ ఈ అత్యాచారాని కారకులైన నలుగురు నిందితులకు 14 రోజులపాటు రిమాండ్‌ విధించారు. అనంతరం పోలీస్‌ స్టేషన్‌ నుంచి మేజిస్ట్రేట్‌ వెళ్లిపోయారు. నిందితులకు రిమాండ్‌ విధించిన కారణంగా మహబూబ్‌ నగర్‌ జిల్లా జైలుకు పోలీసులు తరలించనున్నారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/