పలు రంగాల వారికి ప్రియాంక వ్యక్తిగత లేఖలు

Priyanka Gandhi
Priyanka Gandhi

లఖ్‌నవూ: కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శ ప్రియాంక గాంధీ వాద్రా కాంగ్రెస్‌ పరిస్థితిని చక్కదిద్దేందుకు , గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. అందులో భాగంగా ఆమెగత రెండు నెలలుగా రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ముఖ్యంగా మహిళలు, రైతులపై ప్రత్యేక దృష్టి సారించారు. గెలుపు కోసం వివిధ మార్గాలను అన్వేషిస్తున్నారు. అనేక వర్గాలు, రంగాల వారికి చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా తాజాగా ఆమె ఆశా కార్యకర్తలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, మదర్సాలు, ఉపాధి హామీ కార్యకర్తలు, అంగన్‌వాడీ కార్యకర్తలకు వ్యక్తిగత లేఖలు రాశారు. అందులో వారి సమస్యల్ని ప్రస్తావించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే వాటి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ఆశా కార్యకర్తలకు రాసిన లేఖలో వారికి కేటాయించిన నిధులను పెంచుతామని ప్రియాంక హామీ ఇచ్చారు. అలాగే ఆరోగ్యరంగానికి బడ్జెట్‌లో పెద్దపీట వేస్తామని పేర్కొన్నారు.


మరిన్ని తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/