నన్ను 28 గంటలుగా నిర్బంధంలో ఉంచారు: ప్రియాంక

లక్నో: లఖింపూర్ ఖేరి హింసాత్మక ఘటనలో మృతి చెందిన రైతు కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్లిన తనను గత 28 గంటలుగా నిర్బంధంలో ఉంచినట్టు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ఈరోజు తెలిపారు. ఎలాంటి ఉత్తర్వులు కానీ, ఎఫ్ఐఆర్ కానీ లేకుండా తనను నిర్బంధించినట్టు ఆమె తెలిపారు. నలుగురు రైతులతో సహా 8 మంది మృతికి కారణమైన నిందితులను తక్షణం అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈమేరకు ప్రధాని మోదీని సంబోధిస్తూ ప్రియాంక గాంధీ ఓ ట్వీట్ చేశారు.

”నరేంద్ర మోడీజీ…మీ ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులు, ఎఫ్ఐఆర్ లేకుండా 28 గంటలుగా నన్ను నిర్బంధంలో ఉంచింది. కానీ, అన్నదాతలను అణిచివేతే వ్యక్తులను మాత్రం ఇంతవరకూ అరెస్టు చేయలేదు” అని ప్రియాంక ట్వీట్ చేశారు. నినాదాలు చేస్తూ ఒక క్రమపద్ధతిలో మార్చింగ్ చేస్తున్న రైతులపై ఎస్‌వీయూ దూసుకుపోయిన వీడియోను కూడా ప్రియాంక షేర్ చేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/