పీసీ కోసం ఏకంగా 6.5కోట్ల వజ్రాల హారo

Priyanka Chopra
Priyanka Chopra

బాలీవుడ్ అందాల కథానాయిక ప్రియాంక చోప్రా ప్రేమ పెళ్లి వ్యవహారం రిచ్ గా అంతకంతకు వేడెక్కిస్తోంది. ఈ భామ ఏకంగా అమెరికాకు చెందిన రాకుమారుడినే పెళ్లాడుతోంది. సింగర్ నిక్ జోనాస్ ని కొంగున కట్టేసుకుని నచ్చినట్టు ఆటాడుతోంది.ఇటీవలే ముంబైలో రోఖా (నిశ్చితార్థం) పూర్తి చేసుకుని చాటింపు వేసింది.

ఇప్పుడు అమెరికా – న్యూయార్క్ లో ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్స్ పేరుతో బోలెడంత రచ్చే చేస్తోంది. నిన్న జరిగిన బ్రైడల్ షోవర్ వేడుకలో పీసీ అదిరిపోయే ఆర్భాటంతో హడావుడి చేసింది. ఈ ఈవెంట్ వేళ సఖుడు నిక్ జోనాస్ ఇచ్చిన కానుకేంటో తెలిస్తే కళ్లు భైర్లు కమ్మేస్తాయ్.
పీసీ కోసం అతడు ఏకంగా 6.5కోట్ల (1 మిలియన్ డాలర్) విలువైన  టిఫానీ అండ్ కోకి చెందిన వజ్రాల హారాన్ని కానుకగా ఇచ్చాడు.

ఇంతకుముందు రోఖా ఈవెంట్ వేళ నిక్ కోటి 8లక్షల విలువైన నిశ్చితార్థపు రింగ్ ని తొడిగాడు. ఇప్పుడు అంతకుమించి సర్ ప్రైజ్ ఇచ్చాడు. ఈ ఈవెంట్ వేళ పీసీ ఆనందానికి అవధులే లేవంటే అతిశయోక్తి కాదు. డిసెంబర్ 1 పెళ్లి వేడుకకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే జోధ్ పూర్ లో వెన్యూని ఫిక్స్ చేశారని తెలుస్తోంది. ప్రస్తుతం విదేశాల్లో పీసీ నిక్ జోనాస్ & ఫ్రెండ్స్ తో ఓ రేంజులో చిలౌట్ చేస్తోంది.