అమేజింగ్ బ్యూటీ

Priyanka Chopra New Pic
Priyanka Chopra New Pic

 ప్రియాంక చోప్రా జోనాస్ ఫ్యాషన్ ఛాయిస్ లపై గత కొంత కాలంగా తీవ్రంగా ట్రోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే.  మెట్ గాలాలో పిచ్చుక గూళ్ళ డ్రెస్ తో మొదలైన హంగామా అదోరకంగా చీరను కట్టడం వరకూ కొనసాగింది.  అభిమానులకు తమ ప్రియతమ ప్రియాంక ఎలా ఉన్నా ఓకే కానీ మిగతావారు చూడలేక లిటరల్ గా చచ్చారు . అయితే చాలాకాలం తర్వాత ప్రియాంక అందరిపై కరుణించి అందంగా కనిపించింది.
ప్రియాంక తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఈ ఫోటోకు ప్రియాంక “అండర్ ది టుస్కాన్ సన్  #టీమ్ పిక్సెల్” అంటూ క్యాప్షన్ ఇచ్చింది.  అంటే ఇటలీ లోని టుస్కాన్ లో ఈ ఫోటో దిగింది అన్నమాట. అంతే కాకుండా గూగుల్ పిక్సెల్ ఫోన్ తో పెయిడ్ పార్ట్నర్ షిప్ అని వెల్లడించింది. ఇక ఈ ఫోటో ను తీసినవారు ఎవరనుకున్నారు? ఇంకెవరు.. ప్రియాంక గారి అమెరికన్ భర్తగారు నిక్ జోనాస్.  ఫోటో విషయానికి వస్తే ఒక చేపట్టుగోడపై స్టైలిష్ గా చేతిని పెట్టుకొని నిలబడింది. హాఫ్ ఫోటోనే అయినా ఫుల్ గా అందాల విందు చేసేసింది. తెలుపు.. మెంతి రంగు కాంబినేషన్లో ఉన్న డ్రెస్ చాలా అందంగా కనిపిస్తోంది. ఈ అందమైన డ్రెస్సుకు మ్యాచింగ్ అన్నట్టుగా లైట్ గా బ్రౌన్ షేడ్ లో చేసిన హెయిర్ స్టైలింగ్ సూపర్ గా ఉంది.  
ఈ ఫోటో నెటిజనులకు తెగ నచ్చింది.  “లవ్లీ పిక్ బై నిక్”.. “లుకింగ్ గార్జియస్ ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్”.. “అమేజింగ్ లొకేషన్.. అమేజింగ్ బ్యూటీ”.. “సింప్లీ బ్యూటిఫుల్”.  ఇక ప్రియాంక సినిమాల విషయానికి వస్తే ‘ది స్కై ఈజ్ పింక్’ అనే చిత్రంలో నటిస్తోంది.