భర్త కోసం కార్వా చౌత్ ఉపవాసం

సాంప్రదాయాన్ని ఆచరించిన పిసి

priyanka chopra Carva Chowt fasting
Priyanka chopra Carva Chowt fasting

గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా జోనాస్ కాలిఫోర్నియాలోని లాస్ ఏంజిల్స్ లో భర్త నిక్ జోనాస్ కోసం తన రెండవ కార్వా చౌత్ ఉపవాసం పాటించారు.

సాంప్రదాయ ఎరుపు చీరను ధరించి తన భర్త ధీర్ఘాయుష్కుడిగా సుదీర్ఘ జీవితం గడపాలని.. ఆయన శ్రేయస్సు కోసం ఉపవాసం ఉండటానికి సిద్ధమైంది.

ప్రియాంక తన లవ్లీ-డోవీ కార్వా చౌత్ నుండి కొన్ని ఫోటోల్ని పంచుకోవడానికి సోషల్ మీడియాలోకి వెళ్లింది. తన ఇన్స్టాగ్రామ్ చూస్తే ఎర్రబారిన ఫోటోల సమూహం ఎంతో సంబరంగా కనిపిస్తోంది.

కార్వా చౌత్ వేడుకల నుండి అందమైన ఫోటోలను పీసీ అభిమానుల కోసం పంచుకుంది.

మొదటి ఫోటోలో పీసీ తన అద్భుతమైన మంగళసూత్రం.. సింధూర్ ని ఆవిష్కరించగా.. చెవిరింగులతో అందంగా .. సొగసైన ఎరుపు చీరను ధరించి కనిపించింది.

ఆమె ఫోటో కోసం హాయిగా నవ్వడంతో ఆమె పూజాకి అవసరమైన థాలి పట్టుకొని ఉంది. ప్రతి ఒక్కరికీ కార్వా చౌత్ శుభాకాంక్షలు… ఐ లవ్ యు నిక్ జోనాస్ అంటూ పీసీ సంబరంగా వ్యాఖ్యానం జోడించాశారు.

నిక్ కూడా అవే ఫోటోలను పంచుకుని.. అందరికీ కార్వా చౌత్ శుభాకాంక్షలు తెలిపారు. 

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/