పార్టీని ముందుకు నడపగల సామర్థ్యం ఆమెలో ఉంది

అధ్యక్ష పదవికి ప్రియాంకే సరైన వ్యక్తి

Shatrughan Sinha
Shatrughan Sinha

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి రాహుల్‌ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు అధ్యక్ష పదవిలోకి ఏవరు వస్తారానే దానిపైనే చర్చలు సాగుతున్నాయి. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ నేత శతృఘ్న సిన్హా మాట్లాడుతు కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అధ్యక్ష పదవిలో ఒదిగిపోతారని అభిప్రాయపడ్డారు. సోన్‌భద్ర బాధితులను పరామర్శించే విషయంలో ప్రియాంక చూపిన తెగువ ప్రశంసనీయమన్నారు. సమస్యలపై పోరాటంలో ఆమెను మాజీ ప్రధాని ఇందిరాగాంధీతో పోల్చారు. ప్రజల కోసం అరెస్టులను సైతం ఆనందంగా స్వాగతించారన్నారు. దీంతో పార్టీని ముందుకు నడపడానికి గల సామర్థ్యం ఆమెలో ఉందన్న విషయం తేటతెల్లమైందన్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/