చంచల్‌గూడ జైల్లో ఉన్న ఖైదీ మృతి

chanchalguda jail
chanchalguda jail

హైదరాబాద్‌: చంచల్‌గూడ సెంట్రల్‌ జైల్లో రిమాండ్‌లో లక్ష్మణ్‌ అనే ఖైదీ మృతిచెందాడు. ఇతడు ఓ హత్యకేసులో నిందితుడిగా రిమాండ్‌లో ఉన్నాడు. లక్ష్మణ్‌ చాతిలో నొప్పిగా ఉందంటూ కింద పడిపోయాడు. దీంతో జైలు అధికారులు అతడిని ఆస్పత్రికి తరలించే లోపు గుండెపోటుతో మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించారు.మృతుడి స్వస్థలం కార్ఖానా పరిధిలోని బాలాజీనగర్.


మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/