నిర్భయ దోషుల ఉరికి దగ్గరపడుతున్న సమయం
ఉరికి సిద్ధమవుతున్న జైలు అధికారులు

న్యూఢిల్లీ: నిర్భయ దోషుల ఉరికి సమయం దగ్గరపడుతుండడంతో తీహార్ జైలు అధికారులు సిద్ధమవుతున్నారు. ఉరి కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 16 ఇసుక బస్తాలతో డమ్మీ ఉరి తీయనున్నారు. ఈ మేరకు జైలు అధికారులు తెలిపారు. బక్సర్ జైలు నుంచి కొనుగోలు చేసిన కొత్త ఉరి తాళ్లతో 16న ఉదయం డమ్మీ ఉరి తీయనున్నట్టు పేర్కొన్నారు. దోషులు పవన్‌గుప్తా, అక్షయ్, వినయ్ శర్మ, ముకేశ్ సింగ్‌ల బరువు ఆధారంగా ఇసుక సంచులను సిద్ధం చేసినట్టు తెలిపారు. ఇసుక బస్తాలకు ఉరి తాళ్లు బిగించి డమ్మీ ఉరి తీయాలని నిర్ణయించినట్టు వివరించారు. దోషులు నలుగురినీ ఒకేసారి ఉరితీసేలా జైలులోని 3వ నంబరు గదిలోని ఉరి ప్రాంగణాన్ని విస్తరించారు. ప్రస్తుతం దోషులు నలుగురినీ వేర్వేరు గదుల్లో ఉంచి ఒకరితో ఒకరు కలవకుండా చర్యలు చేపట్టారు.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/