అనుబంధాల ప్రాధాన్యత

జీనవ వికాసం

Priority of relationships
Priority of relationships

మనకేమో బోలెడన్ని పనులు. పాపాయి కళ్లలోకి చూస్తూ ముంగురులు సరిచేస్తూ కబుర్లు వినే తీరికెక్కడ? ఈ చేత్తో ఒక పనీ ఆ చేత్తో మరో పనీ చేసుకుంటూనే వాళ్లు చెప్పేదీ వినాలనుకుంటాం.

కానీ అలా వినడానికి మనసు పెట్టి వినడం అనరనీ, అలాంటివారితో అసలు మాట్లాడాలనే అనిపించదనీ అంటున్నారు నిపుణులు.

మన చెవులు మన చుట్టూ అయ్యే చప్పుళ్లన్నిటినీ గ్రహిస్తాయి. మెదడు మాత్రం వినాలనుకున్న కొన్ని చప్పుళ్లనే గుర్తుంచుకుంటుంది.

అందులో కొన్నిటి ఇంచే ఆలోచిస్తుంది. ఏ ఒకటి రెండిటికో మాత్రమే స్పందిస్తుంది. అంటే విన్పించేవాటిలో మనం నిజంగా వింటున్నది చాలా కొంచెమేనన్నమట.

మనిషికి భౌతికంగా గాలీ నీరూ తిండీ ఎంత అవసరమో మానసికంగా ఇతరులు తనని అర్థం చేసుకోవడం, తాను ఇతరులను అర్థం చేసుకోవడం, తాను ఇతరులను అర్థం చేసుకోవడం అంతే అవసరం. దానికి తోడ్పడేది ఈ వినడమనే ప్రక్రియే.

నిజానికి మాట్లాడడమూ వినడమూ నాణేనికి రెండు వైపుల్లాంటివి. రెండూ కలిస్తేనే సంభాషణ అవు తుంది. అందుకే పెద్దలు మాట్లాడడమే కాదు, వినడమూ ఓ కళేనన్నారు.

మాట్లాడేటప్పుడు ఎదుటివాళ్లు మన మాట వినడానికి ఇష్టపడేలా మాట్లాడాలనీ, వినేటప్పుడు ఎదుటివాళ్లు మనసు విప్పి చెప్పుకోవాలనిపించేలా వినాలనీ పెద్దలు చెబుతారు.

ఒక్కసారి గుర్తుచేసుకోండి. మీరు ఈ మధ్య సావధానంగా ఏమి విన్నారు? చిట్టితండ్రి చెప్పిన సూపర్‌హీరో కథలు విన్నారా?

భాగస్వామి చెప్పిన ఇంటి సమస్యలు విన్నారా? అన్నీ విన్నారా సరే మరి. ఆ విన్నవన్నీ గుర్తున్నాయా? ఏమిటీ ఆలోచిస్తున్నారా?

మేనేజ్‌మెంట్‌ ట్రెయినీలకు ఓ వర్కుసాప్‌ జరుగుతోంది. రెండు సెషన్లకు మధ్య ఇప్పుడు అభ్యర్థుల్లో ఉత్సాహం నింపడానికి ట్రైనర్‌ ఓ కథ చెప్పాడు.

‘మీరు ఒక బస్సు నడుపుతున్నారు. బస్సు బయల్దేరినప్పుడు అందులో ఆరుగురున్నారు.

తర్వాత స్టాపులో మరో 12 మంది ఎక్కారు. జాగ్రత్తగా వినండి. రెండో స్టాపులో ఆరుగురు దిగి నలుగురు ఎక్కారు. మూడోస్టాపులో ఎవరూ దిగలేదు.

ఇద్దరు ఎక్కారు. బస్సు డ్రైవరు వయసు ఎంత? ఎంత మంది ఎక్కారు ఎంతమంది దిగారూ.

అన్న లెక్కల్లో మునిగితేలుతున్న వారంతా చివరి ప్రశ్న విని అవాక్కయ్యారు. ప్రశ్నకీ డ్రైవరు వయసుకీ సంబంధం ఏమిటనీ, డ్రైవరు వయసు తమకు తెలిసే అవకాశం లేదనీ సమాధానలిచ్చారు.

నిజానికి వారు వచ్చిందే అక్కడ ఏం చెప్పినా విని నేర్చుకోవడానికి అలాంటప్పుడు అప్రమత్తంగా ఉండి ట్రైనర్‌ చెప్పేదంతా వినాలి.

కానీ ‘జాగ్రత్తగా వినండి అనే వరకూ ఎవరూ అతను చెప్తున్న దాని మీద దృష్టి పెట్టలేదు. పెట్టినవారు కూడా అంకెలు రాగానే లెక్కలు వేయడంలో మునిగిపోయారు.

సరిగ్గా ‘విని ఉంటే ప్రశ్న తొలి వాక్యంలోనే సమాధానం ఉంది

. ‘మీరు బస్సు నడుపుతున్నారు అంటే డ్రైవర్‌ వయసుగా అక్కడున్న ప్రతి అభ్యర్థీ తన వయసే చెప్పాలి కదా? మనలో చాలామంది అర్థం చేసుకోడానికి వినడం లేదు.

కేవలం సమాధానం ఇవ్వడానికి మాత్రమే వింటున్నారు అంటారు. అమెరికన్‌ రచయిత స్టీఫెన్‌ కోవె. దానికి ఉదాహరణే పై సంఘటన. వినడం చెవ్ఞలతో మాత్రమే చేసే పని కాదు. వినడమనే పనికి చాలా సీనుంది.

అది సరిగ్గా జరగకపోతే మనుషుల మధ్యాసమాజాల మధ్యాబేధాభిప్రాయల మధ్య అపార్థాలు చోటు చేసుకుంటాయి. అనుబంధాలు చెడిపోతాయి. అవాంఛనీయ సంఘటనలు జరుగుతాయి. మొత్తంగా మన సామాజిక వ్యవస్థే దెబ్బతింటుంది.

అందుకే వినడం ఎందుకు ముఖ్యమో, సరిగ్గా ఎలా వినాలో చూద్దాం.

బంధాలకు బలం: వినడం కేవలం కమ్యూనికేషన్లఓ ఒక భాగం కాదు. ఇంకా పెద్ద పాత్రే దానికి ఒక మంచి సంభాషణ ప్రారంభమయ్యేది మంచి శ్రోత ఉన్నప్పుడే.

ఇద్దరు మనుషుల మధ్య పరిచయాన్ని అనుబంధంగా మార్చే శక్తి కేవలం వినే ప్రక్రియకే ఉంది. ఎవరు చెప్పేది అయినా మనం జాగ్రత్తగా వింటున్నామంటే వరి పట్ల మన గౌరవాన్ని తెలియజేస్తున్నామన్నమాటే.

నిత్యం ఇంట్లో కుటుంబసభ్యులతో, ఆఫీసులో సహోద్యోగులతో మాట్లాడతాం. అందరు చెప్పిందీ వింటాం. దానివల్ల కేవలం పనులు అవడమే కాదు, వారికీ మనకీ మధ్య ఒక బంధ ఏర్పడుతుంది. స్నేహానుబంధాలు బలపడడానికి పునాది వేసేది ఇద్దరి మధ్యా రిగే సంభాషణే.

ఎదుటివారు చెప్పుది ఓపిగ్గా వినేవారే మంచి స్నేహితులుగా మారతారు. అలా వినే అలవాటు స్వతహాగా లేకపోతే సాధనతో నేర్చుకోవాలి.

స్నేహితులూ, పరిచయస్తూలు ఎక్కువగా ఉన్న వ్యక్తికి తన మీద తనకు నమ్మకం పెరుగుతుందట.

మాట్లాడడం వల్ల బిపి పెరుగుతుందనీ అదే శ్రద్ధగా వినడం వల్ల ఎక్కువగా ఉన్న బిపి తగ్గుతుందనీ పరిశోధనలు చెబుతున్నాయి. కాబట్టి ఎలాగైనా వీలు చేసుకుని తరచూ స్నేహితులను పలకరించాలి. వాళ్ల కష్టసుఖాలను వినాలి.

రోజూ కాసేపు ఫోన్లూ టివీలన్నీ కట్టిపెట్టి కుటుంబ సభ్యులతో మనసు విప్పి మాట్లాడాలి. పిల్లలు చెప్పే కబుర్లు వినాలి. దానివల్ల అటు ఆనందమూ ఇటు ఆరోగ్యమూ.

కళ్లలోకి చూడాలి:

వినటప్పుడు మాట్లాడుతున్నవారి కళ్లలోకి చూస్తూ వినడం చాలా ముఖ్యం. పిల్లలు మనం వారివైపు చూడకపోతే చెప్పడం ఆపేస్తారు.

నేను చెప్పేది నువ్వు వినడం లేదు అని మొహాన అడిగేస్తారు. ఇతరులు అలా చెప్పరు కానీ వింటున్నవారికి ఆసక్తి లేదని తెలుసుకుంటారు.

మనసు పెట్టకుండా కేవలం చెవులతో విషయాన్ని వింటే సరిగ్గా వినడం అనరు. మనసు పెట్టి వినడం అంటే ఒక విషయాన్ని ఎలా చెబుతున్నారూ ఏయేపదాలు వాడుతున్నారు.

గొంతులో ఎలాంటి భావం పలుకుతోంది అన్నీ గమనిస్తూ వినడం అన్నమాట. మాట్లాడేవారి వాడీ లాంగ్వేజ్‌ కూడా అందులో ఒక ముఖ్యమైన అంశమే.

వాటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని విన్నప్పుడే విషయం పూర్తిగా అర్థమవుతుంది. కొంతమంది ఉంటారు వాళ్లకు మాట్లాడడమే తప్ప వినే అలవాటు ఉండదు.

ఎదుటి వ్యక్తిని ఎప్పుడూ ఒక్కవాక్యం కూడా పూర్తిగా మాట్లాడనివ్వరు. మాటిమాటికీ అడ్డుపడుతుంటారు.

అన్నీ తమకే తెలుసన్నట్లుగా ఏదో ఒకటి మాట్లాడేస్తూ మొత్తానికి సంభాషణ పక్కదారి పట్టించేస్తారు.

జాగ్రత్తగా వింటేనే సరిపోదు, వింటున్నామని ఎదుటివారికి అర్థమయ్యేలా మన చేతలు ఉండాలి అంటే విన్నదాంట్లో సందేహాలుంటే అడగడం.

వింటున్నది అర్థమైందని తెలిసేలా తలపంకించడం, కళ్లతో సమ్మతిని తెలియజేయడం, మాట్లాడుతున్నవారి హావభావాలతో మమేకం కావడం.

ఇవన్నీ మనం ఆసక్తిగా వింటున్నామన్నా విషయాన్ని వారికి అర్థమయ్యేలా చేస్తాయి.

ఏ విషయం గురించి వింటున్నా దాని గురించి ఎంతో కొంత మనకు ముందే తెలిసి ఉండవచ్చు. అంతమాత్రాన కొత్తగా వీళ్లేం చెబుతారులే అనుకుంటే మంచి శ్రోత కాలేరు, కొత్త విషయాలూ నేర్చుకోలేరు

మనకు తెలిసిన విషయంపైనే అయినా ఇంకా కొత్త సమాచారం ఏం చెబుతారో తెలుసుకుందామన్న ఆసక్తితోనే వినడానికి ఉపక్రమించాలి

. ప్రసంగిస్తున్న వ్యక్తి గురించీ విషయం గురించీ పక్కవారితో గుసగుసలాడడం, కామెంట్‌ చేయడం కూడదు. ఎవరైనా సరే, తక్కువగా మాట్లాడినప్పుడే ఎక్కువగా వినగలరు.

అలాంటి అలవాటు ఉన్నవారే గొప్ప వ్యాపారవేత్తలూ నాయకులూ అయ్యారని అధ్యయనాలూ పేర్కొంటున్నాయి.

మాట్లాడడం అంటే మనకు ఆల్రెడీ తెలిసిన విషయాలను ఇతరులకు చెప్పడం. అదే వినడం అంటే తెలియని కొత్త విషయాలను తెలుసుకోవడం అంటారు.

ఉద్యోగులు సరిగా వినకుండా పనులు చేయడం వల్ల వ్యాపారరంగంలో నిత్యం ఎంతో నష్టం జరుగుతుందట. వ్యాపారంలో అంకలే కాదు, వాడే ప్రతిపదమూ కీలకమే.

ఏ కొంచెం తేడావచ్చినా విలువైన సమయమూ డబ్బూ కూడా నష్టపోవాల్సి వస్తుంది.

తాజా ‘నాడి’ వ్యాసాల కోసం : https://www.vaartha.com/specials/health1/