వడోదరో ఘటనపై ప్రధాని విచారం

PM Modi
PM Modi

న్యూఢిల్లీ: గుజరాత్ లోని వ‌డోద‌రా లో జరిగిన రోడ్డు ప్ర‌మాదంలో పదిమంది మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటపై ప్రధాని మోడి తీవ్ర విచారాన్ని వ్య‌క్తం చేశారు. ‘వ‌డోద‌రా లో జ‌రిగిన ప్ర‌మాదాన్ని గురించి తెలిసి నేను దుఃఖిస్తున్నాను. ఈ ఘ‌ట‌న లో త‌మ ఆప్తుల‌ను కోల్పోయిన వారి శోకం లో నేను సైతం పాలుపంచుకొంటున్నాను. ఈ ఘ‌ట‌న‌ లో గాయ‌ప‌డ్డ‌ వారు త్వ‌ర‌గా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. పాల‌న యంత్రాంగం ఘ‌ట‌న స్థ‌లం లో సాధ్య‌మైన అన్ని విధాల స‌హాయ‌క చ‌ర్య‌ల‌ ను తీసుకొంటోంది’ అని ట్విటర్ ద్వారా నరేంద్ర మోడి సంతాపం వ్యక్తం చేశారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/