థాయ్ లాండ్‌ కు బయల్దేరిన ప్రధాని మోడి

మూడు రోజులు పర్యటించనున్న మోడి


PM Narendra Modi departs for Bangkok on 3-day Thailand visit

న్యూఢిల్లీ: ప్రధాని మోడి ఈరోజు థాయ్ లాండ్‌ పర్యటనకు బయల్దేరారు. ఈ సందర్భంగా ఆయన అక్కడ మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. గురునానక్‌ 550వ జయంతిని పురస్కరించుకుని ఏర్పాటు చేసే కార్యక్రమానికి హాజరవుతారు. అంతేకాక 14వ తూర్పు ఆసియా సదస్సులో మోడి పాల్గొననున్నారు. దీంతోపాటు ఆసియన్‌ ఇండియా సదస్సులో కూడా మోడి పాల్గొంటారు. కాగా థాయ్ లాండ్‌ లో స్థిరపడిన భారతీయులను ఉద్దేశించి ఆయన ప్రసంగించనున్నారు. థా§్‌ులాండ్‌ ప్రధాని ప్రయుత్‌ ఛాన్‌ ఓ ఛా ఆహ్వానం మేరకు మోడి బ్యాంకాక్‌లో పర్యటిస్తారు. ఆదివారం మోడి, ప్రయుత్‌ల సమావేశం జరగనుంది. వాణిజ్యం, తీర ప్రాంతాల భద్రత, అనుసంధానం వంటి అంశాల్లో సహకారం పెంపు వంటి అంశాలను వీరిద్దరు చర్చించానున్నారు. దీంతో ఆసియా దేశాల మధ్య పరస్పర సహకారం పెంపొందించే లక్ష్యంతో మోడి ఈ పర్యటన సాగనుంది.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/