‘వర్క్ ఫ్రం హోం’పై ప్ర‌ధాని బోరిస్ జాన్స‌న్ కీలక వాక్యాలు

దృష్టంతా కాఫీపైనే ఉంటుందన్న ప్రధాని
ఆ తర్వాత స్నాక్స్ కోసం వెళ్తామన్న జాన్సన్

లండన్: బ్రిట‌న్ ప్ర‌ధాని బోరిస్ జాన్స‌న్ వ‌ర్క్ ఫ్రం హోంపై కీలక వాక్యాలు చేసారు. వర్క్ ఫ్రం హోం సత్ఫలితాలను ఇస్తుందా? కార్యాలయంలో పనిచేసినప్పటిలానే ఉత్పాదకత వస్తోందా? అన్న ప్రశ్నకు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తనకు ఎదురైన అనుభవాలను పంచుకున్నారు.

వర్క్ ఫ్రం హోం వల్ల ఉద్యోగుల దృష్టి మరలుతుందని చెప్పిన జాన్సన్.. పని మధ్యలో ఇంకో కాఫీ తెచ్చుకునేందుకు ఎక్కువ సమయం వెచ్చిస్తామని పేర్కొన్నారు. ఆ తర్వాత మళ్లీ స్నాక్స్‌ తెచ్చుకోవడానికి అలా నడుచుకుంటూ రిఫ్రిజిరేటర్ వద్దకు వెళ్తామని, తిరిగి నిదానంగా వస్తూ ల్యాప్‌టాప్ వద్దకు వచ్చేసరికి చేస్తున్న పనేంటో కూడా మర్చిపోతామని అన్నారు.

అందుకే, మళ్లీ కార్యాలయానికి రావాల్సిన అవసరం ఉందని అన్నారు. తన మాటలు చాలా మందికి నచ్చకపోవచ్చని, మన చుట్టూ ఇతర ఉద్యోగులు కూడా ఉన్నప్పుడు మన నుంచి మరింత ప్రొడక్టివిటీ వస్తుందని బోరిస్ జాన్సన్ చెప్పుకొచ్చారు. అంతేకాదు, మరింత ఉత్సాహం, కొత్తకొత్త ఐడియాలతో పనిచేస్తామని తాను విశ్వసిస్తానని వివరించారు.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/