రూ. 52 వేలు దాటేసిన బంగారం ధర

gold
gold

ముంబయి: హైదరాబాద్ మార్కెట్ లో 10 గ్రాముల బంగారం ధర రూ. 52,400గా నమోదైంది. దేశంలో పసిడికి గిరాకీ పెరగడంతో పాటు, అంతర్జాతీయ మార్కెట్లో ధరలు కూడా ప్రభావం చూపుతున్నాయని బులియన్ నిపుణులు వ్యాఖ్యానించారు. ఇక దేశ రాజధానిలో బంగారం ధర రూ. 51,443కు చేరుకోగా, ముంబైలో రూ. 50,703గా నమోదైంది. ఇక, వెండి ధర సైతం బంగారంతో సమానంగా పరుగులు పెడుతోంది. కిలో వెండి ధర రూ. 62,760 వద్ద కొనసాగుతోంది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/