చిరంజీవి సినిమాలో ఛాన్స్ కొట్టేసిన బ్యూటీ.. ఎవరంటే?

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆచార్య చిత్రం ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటేందుకు మెగాస్టార్ రెడీ అవుతున్నాడు. కాగా ఈ సినిమాను దర్శకుడు కొరటాల శివ తనదైన మార్క్‌తో తెరకెక్కి్స్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

ఇక ఆచార్య చిత్రం రిలీజ్ కాకముందే తన నెక్ట్స్ చిత్రాలను వరుసబెట్టి ఓకే చేస్తున్నాడు మెగాస్టార్. ఇప్పటికే దర్శకుడు మెహర్ రమేష్‌తో ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్న మెగాస్టార్, ఆ తరువాత మలయాళ సూపర్ హిట్ మూవీ లూసిఫర్‌ను తెలుగులో రీమేక్ చేసేందుకు రెడీ అయ్యాడు. ఈ సినిమాను మోహన్ రాజా డైరెక్ట్ చేస్టున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమాను వీలైనంత త్వరగా ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. కాగా ఈ సినిమాలో హీరోయిన్ పాత్రలో ప్రముఖ నటి ప్రియమణిని సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది.

మలయాళంలో మంజూ వారియర్ నటనకు అక్కడి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. దీంతో అలాంటి పాత్రను ప్రియమణి అయితే బాగా చేస్తుందని భావించిన చిత్ర యూనిట్ ఆమెను ఈ సినిమాలో తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రొడ్యూస్ చేస్తున్న సంగతి తెలిసిందే. వీలైనంత త్వరగా ఈ సినిమాను పట్టాలెక్కించి రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించాలని చిరు అండ్ టీమ్ చూస్తున్నారు.