విటమిన్‌ ‘డి’ లోపం నివారణకు

ఆహారం-ఆరోగ్యం

Vitamin D in fruits
Vitamin D in fruits

విటమిన్‌ డి లోపమనేది ఒకప్పుడు మనదేశం లో పెద్దగా తెలియదు. ఎందుకంటే మనదేశంలో ఏడాది పొడవునా ఎండలుంటాయి.

పాశ్చాత్య దేశాల్లోలా కాకుండా మనకు పొడి వాతావరణం ఉంటుంది.

కానీ జీవన విధానంలో మార్పులు శరవేగం చోటు చేసుకుంటున్న కారణంగా భారతీయు ల్లోనూ విటమిన్‌ డి లోపం సర్వ సాధాణం అయిపోయింది.

అపార్ట్‌మెంట్‌ సంస్కృతి : సూర్యరశ్మిలో మాత్రమే కాకుండా మనం తినే కొన్ని ఆహారపదార్ధాల్లోనూ విటమిన్‌డీ పుష్కలంగా ఉంటుంది.

అపార్ట్‌మెంట్ల లో ఉండే వారికి ఎండతగిలే అవకాశం తక్కువ ఉంటుంది. విటమిన్‌ డీ, క్యాల్షియం లోపంతో బాదపడేవారి సంఖ్య మనదేశంలో కోకొల్లలు.

పెరిగే పిల్లలు, పెద్దవారు, ముఖ్యంగా వృద్ధు ల్లో ఈ సమస్య చాలా ఎక్కువగా ఉంటుం ది. ఎముకల పటుత్వాన్ని కాపాడుకోవాలం టే ఈ విటమిన్‌ మినరల్స్‌ రెండూ ఉండ టం చాలా ముఖ్యం.

మనశరీరానికి అందే విటమిన్‌ డి అత్యధిక భాగం ఎండవల్లే వస్తుంది. క్యాల్షియం మాత్రంమన తినే ఆహారం లో ఉంటుంటి.

చేపల్లో పుష్కలం:

చేపల్లో విటమిన్‌ డి ఎక్కు వవగా లభిస్తుంది. అది కడా సాల్మన్‌ చేపలు, టునా, ట్రౌట్‌ ఫిష్‌ వెరైటీలు అయితే ఇంకా మంచింది. ఇవి మంచి రుచితో పాటు మీకు విటమిన్లు ఇస్తాయి.

ఎముకలకు దృఢత్వం, పటుత్వం రెండూ ఇచ్చేందుకు అవసరమైనం త విటమిన్‌ డి ఇందులో ఉంటుంది. మీరు మాంసాహారులైతే చేపలను ఎక్కువగా తీసుకోండి.

పాలు:

పాలు, పాలపదార్థాలైన నెయ్యి, వెన్న, చీజ్‌, పన్నీ ర్‌లో విటమిన్‌ డి పుష్క లంగా ఉంటుంది. దీంతో మీ ఎముకల్లో మజ్జ కూడా పెరుగుతుంది.

ఎముకలను చాలా బలంగా చేసేందుకు పాలు ప్రత్యక్షంగా తోడ్పడతాయి.

కాబట్టిరోజూ మీకు వీలుపడిన సమయంలో పాలు తాగడా న్ని దిన చర్యగా పెట్టుకోండి. చిన్న పిల్లలే కాదు మధ్య వయసు వచ్చినవారు కూడా పాలు తాగడం చాలా అవసరం.

ఆకు పచ్చని కూర గాయ లు ఆకు పచ్చని కూరగాయల తో కలకాలం పచ్చగా ఉం డచ్చన్నది మనందరికీ తెలిసిన విషయమే.

సోయా, టోపూ :

సోయాపాలు, టోపూ, సోయాతో తయా రైన ఇతర ఆహార పదార్థాలు మన ఎముకలకు రక్షాకవచం లా పనిచేయడంలో దోహదపడతాయి.

విటమిన్‌ డి ఇందు లో ఎక్కువగా ఉంటుంది. టోపూ అంటే సోయాతో చేసిన పనీర్‌, ఇది ప్లాంట్‌ బేస్డ్‌ కనుక సోయాతో తయారైన పాలు, ఇతర పదార్ధాలను వేగన్స్‌ సంపూర్ణంగా ఆరగించవచ్చు.

సోయాపైన మీకేమైనా అపోహలుంటే వాటిని పక్కన పెట్టండి. అవగాహన లేకపోవడంతో సోయాపై పలు అపోహలకు గురవుతున్నారు.

గుడ్లు:

ప్రొటీన్‌, విటమిన్‌ డీ, క్యాల్షియం సంపూర్ణంగా ఉన్న మరో పదార్ధం గుడ్లు. కోడిగ్లులోని తెల్లసొన అక్షరా లా పోషకాల భాండాగారం. మన శరీరానికి అవసర మైన ప్రొటీన్లు, విటమిన్‌ డిని ఇచ్చే శక్తి గుడ్లకుంది.

అందుకే ఉడికించిన గుడ్లు లేదా ఆమ్లెట్‌ను రొటీన్లో చేర్చుకుంటే మంచిదని పోషకాహార నిపుణులు సూచనలిస్తున్నారు.

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/