పాకిస్థాన్‌కు అన్ని దారులు మూసుకుపోయాయి: బిపిన్‌రావత్‌

bipin rawat
bipin rawat

న్యూఢిల్లీ: ఆర్మీచిఫ్‌ బిపిన్‌ రావత్‌ మాట్లాడుతూ పాకిస్థాన్‌కు అంతార్జతీయంగా ఒత్తిడులు పెరిగాయని ఇక పాకిస్థాన్‌ తన దుష్టబుద్దిని పక్కన పెట్టి దిద్దుబాటు చర్యలు చెపట్టాలని రావత్‌ పెర్కొన్నారు. పాకిస్థాన్‌ ఉగ్రవాదులకు, సంబదిత సంస్థలకు ఆశ్రయం కల్పిస్తున్న విషయంలో (ఎఫ్‌ఏటీఎఫ్‌) పాకిస్థాన్‌కు మొట్టికాయలు వెసింది. ఇపుడు పాక్‌కు ఎన్నడు లేని విధంగా ఒత్తిడి పెరిగిందని, తప్పించుకొవడం కుదరదని రావత్‌ అభిప్రాయపడ్డారు. కావునా శాంతి స్థాపన జరగాలంటే
పాకిస్థాన్‌ గట్టిగా ఉగ్రవాదులపై చర్యలు తీసుకొవాల్సిందేనని కోరుకుంటున్నాం. లేకుంటే ‘గ్రే లిస్ఞ్టు లో పెట్టడం ఏ దేశానికైనా ఎదురు దెబ్బె. అలాంటిది ‘బ్లాక్‌లిస్ట్ఞులో పెడితే ఏ దేశమూ కోలుకోలేదు కావూనా పాక్‌ ఇప్పటికైనా ఎఫ్‌ఏటీఎఫ్‌ సిఫార్సులను ఖచ్చితంగా అమలు చేసి తీరాల్సిందే అని బిపిన్‌ రావత్‌ అన్నారు. ఎఫ్‌టీఎఫ్‌ నిర్ధేశించిన 27 లక్ష్యాల్లో 22 అంశాల్లో పాక్‌ విఫలమైంది.
దింతో ఆ సంస్థ పాక్‌కు మొట్టికాయలు వేసింది. వచ్చే ఎడాది వరకు చర్యలు చెపట్టకపోతే బ్లాక్‌లిస్టు లో పెడతామని ఆ సంస్థ హెచ్చరించింది. దీనిని దృష్టిలో పెట్టుకొని పాకిస్థాన్‌ మారుతుందా లేక తన దుష్టబుద్ది చూపిస్తుందా వేచిచూడాలి.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి..https://www.vaartha.com/news/national/