అధ్యక్ష ఎన్నికలు వాయిదా వేయాలి

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ సూచన

Presidential elections should be postponed-Trump
Presidential elections should be postponed-Trump

కరోనా పరిస్థితుల నేపథ్యంలో అధ్యక్ష ఎన్నికలను వాయిదా వేయాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ సూచించారు.

నవంబర్‌ 3న జరగబోయే ఎన్నికల్లో ప్రజలు ధైర్యంగా ఓటు వేసే పరిస్థితులు ఏర్పడే దాకా ఈ ప్రక్రియను నిలిపివేయడమే మంచిదని అన్నారు.

ఒకవేళ ఆన్‌లైన్‌లో ఎన్నికలు నిర్వహిస్తే మోసపూరిత ఎన్నికలుగా చరిత్రలో నిలిచిపోయే ప్రమాదం ఉందన్నారు. కరోనా విపత్తు నుంచి తేరుకుని, ప్రజలు స్వేచ్ఛగా ఓటేసే వరకు ఎన్నికలను వాయిదా వేయాలంటూ ట్వీట్‌ చేశారు.

ఎన్నికలను రద్దు చేసేందుకు ట్రంప్‌ ప్రయత్నిస్తున్నారంటూ డెమొక్రాట్లు మొదటి నుంచీ ఆరోపిస్తూ వస్తున్నారు. మరోవైపు మెయిల్‌ ఇన్‌ ఓటింగ్‌ను ట్రంప్‌ వ్యతిరేకిస్తున్నారు.

దేశ జీడీపీ భారీగా క్షీణించినట్లు వార్తలు వచ్చిన కొద్దిసేపటికే ట్రంప్‌ ఈమేరకు ట్వీట్‌ చేయడం చర్చనీయాంశమైంది. అయితే, అమెరికా రాజ్యాంగం ప్రకారం ఎన్నికల తేదీనిమార్చే అధికారం అధ్యక్షుడికి ఉండదు.

1845 నుంచి క్రమం తప్పకుండా నవంబర్‌ 3నే ఎన్నికలు నిర్వహిస్తూ వస్తున్నారు.

ఈసారి ఎన్నికల్లో రిపబ్లిక్‌ పార్టీ పరాజయం తప్పదని రాజకీయ నిపుణులు, విశ్లేషకులు అభిప్రాయపడుతున్న తరుణంలో ట్రంప్‌ కొత్త ఎత్తుగడ ఆసక్తికరంగా మారింది.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/