బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి, ప్రధాని

న్యూఢిల్లీ: రాష్ట్రపతి రామ్నాథ్ కొవింద్, ప్రధాని నరేంద్ర మోడి దేశంలోని ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. బక్రీద్ సేవ, మానవత్వం, సోదరభావం, త్యాగానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు రాష్ట్రపతి. కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించి ప్రార్థనల్లో పాల్గొనాలని రాష్ర్టపతి కోరారు. సామరస్యపూర్వక, సమగ్రమైన సమాజాన్ని నిర్మించేందుకు ప్రేరణ కలిగిస్తుందని భావిస్తున్నాను అని మోడి ట్వీట్ చేశారు. సోదరభావ స్ఫూర్తి ఇలాగే కొనసాగాలని ఆశిస్తున్నట్లు మోడి చెప్పారు.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/