రేపు తిరుమల శ్రీవారిని దర్శించుకోనన్ను రాష్ట్రపతి

స్వాగతం పలకనున్న గవర్నర్, సిఎం

Ramnath Kovind

న్యూఢిల్లీ: రేపు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. చెన్నై నుంచి వైమానిక దళ ప్రత్యేక విమానంలో ఉదయం పదిన్నర గంటలకు తిరుపతి విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడాయనకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి జగన్‌ స్వాగతం పలుకుతారు. అనంతరం తిరుచానూరు చేరుకుని శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకుంటారు. మధ్యాహ్నం 12.15 గంటలకు తిరుమలలోని విశ్రాంతి గృహానికి చేరుకుంటారు. స్వామివారి దర్శనానంతరం మధ్యాహ్నం మూడు గంటలకు తిరుమల నుంచి బయలుదేరి విమానాశ్రయం చేరుకుంటారు. 3.50 గంటలకు అక్కడి నుంచి అహ్మదాబాద్ వెళ్తారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/