నిర్భయ దోషి క్షమాభిక్ష పిటిషన్ తిరస్కరణ

president-ram-nath-kovind-nirbhaya-convict-pawan-gupta
president-ram-nath-kovind-nirbhaya-convict-pawan-gupta

న్యూఢిల్లీ: నిర్భయ దోషి పవన్ కుమార్ గుప్తా దాఖలు చేసిన క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ తిరస్కరించారు. దీంతో దోషులకు మంగళవారం ఉదయం ఉరిశిక్షకు అమలుపై సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. నిర్భయ దోషులు నలుగురు దాఖలు చేసిన క్షమాభిక్ష పిటిషన్లను రాష్ట్రపతి తిరస్కరించారు. అంతకు ముందు పవన్ దాఖలుచేసిన క్యూరేటివ్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే. తనకు విధించిన ఉరిశిక్షను జీవితఖైదుగా మార్చాలన్న పవన్ విజ్ఞ‌ప్తిని జస్టిస్ ఎన్వీ రమణ ధర్మాసనం తోసిపుచ్చింది. దోషికి ఉరి శిక్ష విధించడం సరైందేనని అభిప్రాయపడింది. సుప్రీం తన పిటిషన్‌ను తిరస్కరించడంతో పవన్ లాయర్ ఏపీ సింగ్ క్షమాభిక్ష పిటిషన్‌ను దాఖలు చేశారు. తాజాగా, రాష్ట్రపతి దీనిని తిరస్కరించడం విశేషం.

తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/