యూపీలో రెండు రోజులు పర్యటించనున్న రాష్ట్రపతి

న్యూఢిల్లీ: నేడు, రేపు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉత్తరప్రదేశ్‌లో పర్యటించనున్నట్టు రాష్ట్రపతి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. బుధవారం జరిగే చౌదరి హర్‌మోహన్ సింగ్ యాదవ్ జయంత్యుత్సవాల్లో రాష్ట్రపతి పాల్గొంటారు. హర్‌కోర్ట్ బట్లర్ టెక్నాలజీ యూనివర్శిటీలో గురువారం జరిగే శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొని ప్రసంగిస్తారు. అదేరోజు, ప్రధాని నరేంద్ర మోడీ సైతం యూపీలోని గౌతమ్ బుద్ధ నగర్‌లో నొయిడా అంతర్జాతీయ విమానాశ్రయానికి (ఎన్ఐఏ) శంకుస్థాపన చేస్తారు. మరోవైపు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సైతం యూపీలో రెండు రోజుల పర్యటన చేపట్టారు. వచ్చే ఏడాది యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో నడ్డా పర్యటన జరుగుతున్నారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/