లవ్లీనాకు అభినందనలు తెలిపిన రాష్ట్రపతి

న్యూఢిల్లీ : రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌ ఒలింపిక్‌ పతక విజేత లవ్లీనా బోర్గోహైన్‌కు అభినందనలు తెలిపారు. లవ్లీనా దేశానికే గర్వకారణంగా నిలిచిందన్నారు. ఆమె సాధించిన ఒలింపిక్‌ మోడల్‌ యువతకు స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. ముఖ్యంగా యువతులు సవాళ్లను ఎదుర్కొనేందుకు, కలలను సాకారం చేసుకునేందుకు స్ఫూర్తినిస్తుందంటూ ట్వీట్‌ చేశారు. టోక్యో ఒలిపింక్స్‌లో 64-69 కేజీల విభాగంలో బుధ‌వారం జ‌రిగిన సెమీఫైన‌ల్లో ట‌ర్కీ బాక్సర్‌ చేతిలో 0-5తో ఆమె ఓడిపోయింది.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/andhra-pradesh/