తుర్క్‌మెనిస్తాన్‌ పర్యటనలో రాష్ట్రపతి కోవింద్

ఇరు దేశాల కీలక ఒప్పందాలు!

President Ram Nadh Kovind on a visit to Turkmenistan

Turkmenistan: భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తాజాగా తుర్క్‌మెనిస్థాన్‌ పర్యటనలో ఉన్నారు. 3 రోజుల పర్యటన నిమిత్తం శనివారం ఇక్కడికి చేరుకున్న రాష్ట్రపతి , తుర్క్‌మెనిస్తాన్ అధ్యక్షుడు సెర్దార్ బెర్డిముహమెడోవ్‌ తో భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై వీరు చర్చించారు. అనంతరం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, తుర్క్‌మెనిస్థాన్‌ అధ్యక్షుడు సర్దార్‌ బెర్దిముహమెడో మధ్య వ్యక్తిగత చర్చలు జరిగాయి.

President Ram Nadh Kovind on a visit to Turkmenistan

భారతదేశం మధ్య ఆసియా శిఖరాగ్ర సమావేశం ఫ్రేమ్‌వర్క్‌తో సహా ద్వైపాక్షిక, ప్రాంతీయ సహకారంపై చర్చించారు. విపత్తు నిర్వహణ, ఆర్థిక మేధస్సు, సంస్కృతి, యువజన వ్యవహారాల్లో సహకారం కోసం భారతదేశం – తుర్క్‌మెనిస్తాన్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు వీరి సమక్షంలో జరిగాయి.

President Kovind meets with President of Turkmenistan Serdar Berdymohmedow

ఇరు దేశాల మధ్య బహుముఖ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేసేందుకు అంగీకరించామని రాష్ట్రపతి కోవింద్ తెలిపారు. వివిధ ప్రాంతీయ, అంతర్జాతీయ సమస్యలపై అభిప్రాయాలను కూడా మార్పిడి చేసుకున్నామని రాష్ట్రపతి వెల్లడించారు. అంతే కాకుండా ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్‌పోర్ట్ కారిడార్, అష్గాబత్ ఒప్పందానికి సంబంధించిన ప్రాధాన్యతను ఎత్తిచూపామని రామ్‌నాథ్ కోవింద్ తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం : https://www.vaartha.com/andhra-pradesh/