రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్‌ శీతాకాల విడిది రద్దు

హైదరాబాద్: రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్‌ శీతాకాల విడిది రద్దు అయ్యింది. ఈ మేరకు ఢిల్లీ రాష్ట్రపతి భవన్ వర్గాలు వెల్లడించాయి. ప్రతి ఏడాది సంప్రదాయం ప్రకారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌కు వస్తుంటారు. ఈ క్రమంలో బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేసేందుకు ఆయన డిసెంబర్ చివరి వారంలో రానున్నారని రాష్ట్రపతి భవన్ ఇటీవల తెలిపింది. అయితే, రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్‌ శీతాకాల విడిది రద్దు అయ్యినట్లు తెలంగాణ ప్రభుత్వానికి రాష్ట్రపతి భవన్‌ సమాచారం అందించింది.

షెడ్యూల్‌ ప్రకారం ఈనెల 29 నుంచి జనవరి 3వరకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ హైదరాబాద్ రావల్సి ఉంది. దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి కేసు పెరుగుతుండటం, కొత్తగా ఒమిక్రాన్‌ వ్యాప్తి నేపథ్యంలో వాయిదా పడ్డట్టు సమాచారం. మరోవైవైపు రాష్ట్రపతి రాక సందర్భంగా బొల్లారంలో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు ప్రోటోకాల్ విభాగం చేపట్టింది. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా ఆక్టోపస్ పోలీసులు రాష్ట్రపతి నిలయంలో మాక్‌ డ్రిల్ చేపట్టారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/